Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్రం ఆర్డర్.. ఒక్కో డోస్ ధర ఎంతంటే?

By:  Tupaki Desk   |   11 Jan 2021 4:53 PM GMT
కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్రం ఆర్డర్.. ఒక్కో డోస్ ధర ఎంతంటే?
X
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో కలిసి తయారు చేసిన ‘కోవీషిల్డ్’కు దేశంలో అత్యవసర అనుమతిని కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం నుంచి కొనుగోలు ఆర్డర్ ను అందుకున్నట్లు సీరమ్ సంస్థ ధ్రువీకరించింది.

కోవిషీల్డ్  వ్యాక్సిన్ ఒక డోసుకు 200 రూపాయల చొప్పున అందించనున్నట్లు సీరమ్ సంస్థ తెలిపింది. ప్రతి వారం కొన్ని మిలియన్ మోతాదుల కోవిషీల్డ్ సరఫరా చేస్తామని.. , ప్రారంభంలో 11 మిలియన్ మోతాదులను సరఫరా చేయవచ్చునని తెలుస్తోంది.

దేశంలో టీకా సరఫరా జనవరి 16న ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు సీరం సంస్త వద్ద 100 మిలియన్ మోతాదులకు ఒక్కో డోసుకు రూ.200 ధర నిర్ణయించింది. ఈ టీకాను మొదట ఒక కోటి ఆరోగ్య కార్యకర్తలతో పాటు రెండు కోట్ల ఫ్రంట్‌లైన్ మరియు అవసరమైన కార్మికులకు అందించనున్నారు. దాదాపు రెండు కోట్ల మందికి ఉచితంగా ఈ టీకా అందిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ప్రకటించారు.

కరోనా నియంత్రణ లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రప్రభుత్వం ప్రస్తుతం ఈ టీకాల పంపిణీని ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం నుంచే ఫూణే నుంచి టీకా రవాణా చేపట్టనున్నారు. 11 మిలియన్ల డోసులను సీరం సంస్థ ప్రభుత్వానికి అందించనుంది.