Begin typing your search above and press return to search.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   8 March 2021 2:33 PM GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన
X
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన ప్రకటన చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో తాము సంప్రదింపులు జరిపామని నిర్మల పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏపీ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవని స్పష్టం చేశారు.

ఇక విశాఖ ఉక్కు పరిశ్రమలో 100శాతం పెట్టుబడులను కేంద్రప్రభుత్వం ఉపసంహరిస్తోందని.. ప్రైవేటీకరిస్తున్నామని నిర్మల సంచలన ప్రకటన చేశారు. మొత్తం ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసం ఈ నిర్ణయమన్నారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ఏపీలో ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. ఏకంగా మొన్నీ మధ్యే ఏపీ బంద్ కూడా జరిగింది. దీనికి వైసీపీ మినహా అన్ని పార్టీలు సపోర్టు చేశాయి. ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం చేసిన ప్రకటన ఇప్పుడు పెను దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.