Begin typing your search above and press return to search.
ఢిల్లీకి వచ్చింది ప్రేమలేఖలు రాయటానికి కాదు సరే.. ప్రగతిభవన్ కు వచ్చేది?
By: Tupaki Desk | 24 Dec 2021 10:02 AM ISTఇప్పుడు తప్పులు చేస్తే.. ఇప్పుడే మూల్యం చెల్లించే పరిస్థితి ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇదే మాటను మరికొందరు కలియుగధర్మంగా చెబుతుంటారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఈ వాదనలో నిజం ఉందనిపించక మానదు. చేతిలో అధికారం ఉంటే చాలు.. ఏమైనా చేసేయొచ్చనే ధోరణి పాలకుల్లో ఎక్కువైంది. అందుకేనేమో.. తాము చేసిన పనులు.. ఇప్పుడు తమకే ఎదురయ్యే పరిస్థితి. తాజాగా తెలంగాణ అధికార పక్షానికి అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా విపక్షనేతలు మొదలు కొని సామాన్యుల వరకు ఆయన దర్శన భాగ్యం కలుగదు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ మంత్రివర్గంలోని మంత్రులకు కూడా అలాంటి అవకాశం ఉండదు. ప్రగతి భవన్ కు వచ్చి అదే పనిగా వెయిట్ చేస్తే కానీ.. కేసీఆర్ ను కలిగే అవకాశం రాదు. దీంతో.. కేసీఆర్ తో భేటీ కోసం కొమ్ములు తిరిగిన మంత్రులే గంటల తరబడి ప్రగతిభవన్ లో వెయిట్ చేస్తుంటారు.
అలాంటప్పుడు మౌనంగా ఉండే గులాబీ నేతలు.. తాజాగా ఢిల్లీకి వచ్చి కేంద్ర వ్యవసాయ మంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరటం.. బిజీగా ఉన్నానని చెబితే..తమను కలవకుండా చిరాకు తెప్పిస్తున్నారని మండి పడుతూ.. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం తెలంగాణలోని నాలుగు కోట్ల మందిని అవమానించటమేనని గులాబీ నేతలు గుక్క తిప్పుకోకుండా మండి పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి తాము వచ్చింది ప్రేమ లేఖలు రాసేందుకు కాదంటున్న వారు.. తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసం వచ్చినట్లు మండిపడుతున్నారు. కేంద్రానికి రైతుల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవటం బాధాకరమన్నారు. కేంద్రం ఒక రాజకీయ పార్టీలా మాట్లాడుతుందని.. కేంద్ర మంత్రులు రాజకీయ నేతల్లా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
ఢిల్లీకి వచ్చింది లవ్ లెటర్లు రాయటానికి కాదనే గులాబీ నేతలు.. తమ ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రగతిభవన్ కు వచ్చే వారికి దర్శన భాగ్యం ఎందుకు లభించదో చెబితే బాగుండదు. ప్రగతి భవన్ కు వచ్చేసి.. సారును కలిసేందుకు తహతహలాడేది ఎందుకోసం? గులాబీ నేతలు ఢిల్లీకి వచ్చింది ప్రేమ లేఖలు రాయటానికి కాదన్నట్లే.. ప్రగతిభవన్ కు వచ్చే వారంతా కూడా సమస్యలు చెప్పుకోవటానికి.. వాటికి పరిష్కార మార్గాలు ముఖ్యమంత్రి చూపిస్తారన్న నమ్మకంతో అన్న విషయాన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోరు? తాము చేసేది ఒప్పు అయినప్పుడు.. మిగిలిన వారు చేసేది కూడా ఒప్పే అవుతుంది కదా? మరి.. సీఎం కేసీఆర్ మైండ్ సెట్ ఇప్పటికైనా మారేనా? అన్నది అసలు ప్రశ్న. గులాబీ నేతలకు ఢిల్లీలో ఈ రోజు ఎదురైన పరిస్థితి.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఏడున్నరేళ్లుగా ఇలాంటి పాట్లే పాడుతున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు కదా?