Begin typing your search above and press return to search.
ఏపీలో రహదారులకు కేంద్రం నిధులు.. ఎక్కడెక్కడ అంటే..?
By: Tupaki Desk | 20 Feb 2021 7:06 PM ISTఆంధ్రప్రదేశ్ లో రహదారుల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊంది. ఏపీకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు (హైవే ప్రాజెక్టులు) ఆమోదం తెలుపుతూ కేంద్ర రోడ్డు రవాణ రహదారుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఎన్‌హెచ్ 130 సీడీకి చెందిన కొర్లమ్-కంటకపల్లి సెక్షన్ 6 లైన్ డెవలప్‌మెంట్ పనులకు మోక్షం లభించింది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు రూ.772.7 కోట్లు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాయ్‌పూర్- విశాఖపట్నం ఎకనమిక్స్ కారిడార్ కింద ఈ ప్రాజెక్ట్ పనులు జరగనున్నాయి.
అదేవిధంగా.. ఎన్‌హెచ్ 130 సీడీకి చెందిన కంటకపల్లి- సబ్బవరం 6 లైన్ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు రూ.824 కోట్లుగా ఉంటుంది. వీటితోపాటు అనంతపురంలో ఎన్‌హెచ్ 42కు చెందిన 4 లైన్ల అర్బన్ రోడ్డు విస్తరణ పనులకు కూడా కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఈ పనులకు రూ.311 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని రహదారులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. రాయ్‌బరేలి- జగదీశ్‌పూర్ 2/4 లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.720 కోట్లు. వీటితోపాటు మరో రెండు ప్రాజెక్టులకు కూడా కేంద్ర రోడ్డు రవాణ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ ఓకే చెప్పారు.