Begin typing your search above and press return to search.

పోలవరం పునరావాసంతో కేంద్రానికి సంబంధం లేదా?

By:  Tupaki Desk   |   26 Oct 2020 5:00 PM IST
పోలవరం పునరావాసంతో కేంద్రానికి సంబంధం లేదా?
X
పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే అని దసరా సందర్భంగా సమీక్షలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం పూర్తి చేయాలన్న డిమాండ్ ను వైసీపీ తెరపైకి తీసుకొచ్చినట్టైంది.

అయితే సమాచార హక్కు చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ గురించి కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తి అయ్యింది? ఎంత ఖర్చు చేశారు? పునరావాసం సంగతి ఏంటనే విషయాలు వెలుగుచూశాయి.

సమాచార హక్కు చట్టం కింద పోలవరంపై ఒక ఆర్టీఐ కార్యకర్త సమాచారం కోరారు. ఇందులో 2016 నాటి కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారం.. పునరావాసంతో సంబంధం లేకుండా కేవలం నిర్మాణ నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని ఆర్టీఐ ద్వారా స్పష్టమైంది.

ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి మొత్తం రూ.8814 కోట్లు విడుదల చేసిందని ఆర్టీఐ సమాచారంలో వెలుగుచూసింది. ఇప్పటివరకు కేవలం 20శాతం పునరావాసం మాత్రమే పూర్తయినట్టు తేలింది.

దీంతో ఇక తెలంగాణ, ఒడిషా రాష్ట్రంలో ముంపు, పునరావాసంతో సంబంధం లేకుండానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని.. ముంపు బాధితుల పునరావాసాన్ని కేంద్రం పట్టించుకోకపోవచ్చన్న అభిప్రాయలు ఈ ఆర్టీఐ నివేదిక ద్వారా వ్యక్తమవుతున్నాయి.