Begin typing your search above and press return to search.

న్యూయర్ వేడుకలపై ఆంక్షలు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

By:  Tupaki Desk   |   30 Dec 2020 9:11 AM GMT
న్యూయర్ వేడుకలపై ఆంక్షలు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
X
అందరినీ భయపెట్టిన 2020 సంవత్సరం చివరకు ఎలాగోలా ముగుస్తోంది. ప్రజలు నూతన సంవత్సరాన్ని చాలా ఆశతో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది తమ నూతన సంవత్సర ప్రణాళికలను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. నూతన సంవత్సర ప్రారంభోత్సవాన్ని గొప్పగా.. పార్టీగా జరుపుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. వీరందరికీ కేంద్రం షాకిచ్చింది. ఈ మేరకు కఠిన ఆంక్షలతో మార్గదర్శకాలు విడుదల చేసింది.

దేశంలో కోవిడ్ -19 కేసులు పెరగడం.. కొత్త కరోనా జాతి కేసులు ఎక్కువ కావడంతో రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కోరింది. న్యూ ఇయర్ పార్టీలపై కఠినంగా వ్యవహరించాలని.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం రాష్ట్రాలకు ఈ మార్గదర్శకాలను చేసింది. నూతన సంవత్సర వేడుకల్లో కరోనా భద్రతా ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలను కోరింది. హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (డిజిహెచ్ఎస్) నేతృత్వంలోని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (జెఎంజి) మరియు డిజి, ఐసిఎంఆర్ సభ్యుడు (ఆరోగ్యం), నీతిఆయోగ్ సంయుక్త నేతృత్వంలోని జాతీయ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చిన ఆదేశాలను పాటించాలని రాష్ట్రాలను కోరారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో బ్రిటన్ లో ప్రబలిన నూతన సూపర్ స్ప్రేడర్ కరోనా కేసులు అరికట్టడానికి అప్రమత్తతో ఉండాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే 2021 జనవరి 7 వరకు యుకే నుంచి విమానాల రాకపోకలపై సస్పెన్షన్‌ను కేంద్రం పొడిగించింది.

ఇప్పటికే పలువురు ప్రముఖులు గోవాకు వెళ్లి నూతన సంవత్సరానికి పార్టీలతో స్వాగతం పలికారు. మరి ఈ న్యూయర్ వేళ కేంద్రం ఆదేశాలకు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో.. రాష్ట్రాలు ఏ విధమైన ఆంక్షలు విధిస్తాయో చూడాలి. అయితే ఈ వార్తలతో న్యూయర్ పార్టీలకు సిద్ధమైన వారు ఆందోళన చెందుతున్నారు.