Begin typing your search above and press return to search.
చిన్నారి ప్రాణాల కోసం.. చట్టాన్ని పక్కనపెట్టిన కేంద్రం..!
By: Tupaki Desk | 12 Feb 2021 6:00 PM ISTచట్టంతో.. న్యాయంతో.. అప్పుడప్పుడూ మానవత్వానికి సంఘర్షణ వస్తుంది. అలాంటి సమయంలో విశాలంగా ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చట్టాన్ని, న్యాయాన్ని కూడా ఒక్కోసారి పక్కన పెట్టాల్సి వస్తుంది. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈ నిర్ణయం ఓ చిన్నారి ప్రాణాలను కాపాడడంలో ఎంతో సహకరించనుంది!
ముంబైకి చెందిన ఐదు నెలల చిన్నారి తీరా కామత్ ను జన్యపరుమైన జబ్బు వేధిస్తోంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోవడం ఖాయం. పుట్టిన రెండు వారాల్లోనే వ్యాధిని నిర్ధారించారు. కానీ.. ట్రీట్మెంట్ ఖరీదు ఒకటీ రెండు కాఆదు.. ఏకంగా రూ.16 కోట్లు!
తీరా కామత్ కు ఉన్న ఆ వ్యాధి పేరు 'స్పైనల్ మస్క్యులర్ ఆస్ట్రోఫీస్'. అరుదైన ఈ వ్యాధి వల్ల.. పాలుతాగేటప్పుడు ఈ పాప ఊపిరి తీసుకోలేకపోతోంది. ఈ వ్యాధిని నయం చేయడానికి సుమారు రూ.16 కోట్ల విలువైన మందులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే.. ఈ మందులకు జీఎస్టీ కింద ఏకంగా రూ.6 కోట్లు చెల్లించాల్సి వస్తోంది!
పాప ఆపరేషన్ కు అవసరమైన డబ్బులు రూ.16 కోట్లను విరాళాల రూపంలో దాతల నుంచి సేకరించారు తల్లితండ్రులు ప్రియాంక, మిహిర్ కామత్. కానీ.. మళ్లీ జీఎస్‌టీ కోసం రూ.6 కోట్లు అవసరమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర బీజేపీ నేత ఫడ్నవీస్.. ప్రధానితోపాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ చిన్నారి కేసును ప్రత్యేకమైనదిగా భావించి, పన్నులు రద్దుచేయాలని కోరారు.
మానవీయ కోణంలో ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం.. జీఎస్‌టీని రద్దు చేసింది. దీంతో ఆ పన్ను చెల్లించకుండానే మందులు దిగుమతి చేసుకునే అవకాశం లభించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి