Begin typing your search above and press return to search.
103 ఏళ్ల వయసులో గర్భవతిని చేసి పెళ్లాడిన వృద్ధుడు
By: Tupaki Desk | 9 March 2020 10:50 AM ISTపెళ్లి చేసుకున్న వారిలో సంతానం కలగక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మారిన జీవన విధానం, జన్యులోపాలు తదితర కారణాలతో నేటి యువతకు సంతానం సమస్య ఎదురవుతోంది. 25 నుంచి 35ఏళ్లలోపు వారికి ఈ సమస్య తీవ్రంగా ఉంది. పెళ్లయి పదేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో ఆస్పత్రుల దారిన పడుతున్నారు. అయితే వీరికి స్ఫూర్తినిచ్చేలా కట్టె పట్టుకునే వయసులో తాత ఇఫ్పుడు ఓ యువతిని గర్భవతిని చేసి త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతడి వయసు 103 ఏళ్లు. ఆయన పెళ్లి చేసుకున్న యువతి వయసు 27 ఏళ్లు. ఈ చిత్రమైన ఘటన ఇండినేషియాలో జరిగింది.
ఇండోనేషియాలోని సులావేసి దీవికి చెందిన యువతి ఇండో అలంగ్ 27 ఏళ్లు ఉంటుంది. కొన్నాళ్లుగా ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుందామని చెప్పగానే ఆ యువకుడు స్థానికంగా ఉండకుండా పారిపోయాడు. పెళ్లి మాట ఎత్తగానే ప్రేమికుడు వదిలేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. కలత చెందుతున్న సమయం లో స్థానికం గా ఉంటున్న మాజీ యుద్ధ వీరుడు103 ఏళ్ల వృద్ధుడు పువాంగ్ కతే పరిచయమయ్యాడు. తన గతమంతా ఆ ముసలాయనతో చెప్పేసింది. ఈ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడని చెబుతూ ఆయనతో పంచుకుంది. ఈ సమయంలో ఆమెకు పువాంత్ కతె ధైర్యం చెప్పాడు.. ఆమెను మామూలు మనిషి చేయడానికి కృషి చేశాడు. అతడి ఓదార్పు మాటలు, అప్యాయత ఇండో అలంగ్ కు ఊరటినిచ్చాయి. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ జంటయ్యారు.
దీంతో ఇద్దరు శారీరకంగా ఒకటయ్యారు. అయితే ఆశ్చర్యంగా ఆ యువతి మూడు నెలలకు గర్భం దాల్చింది. దీంతో ఈ విషయం పువాంగ్ కతెకు చెప్పగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించారు. అయితే ఈ పెళ్లి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించడం తో 76 ఏళ్ల వయసు వ్యత్యాసం తో ఆ ఇద్దరు వివాహం చేసుకున్నారు. పువాంగ్ ను ఆయన మనవళ్లే దగ్గరుండి పెళ్లి కొడుకుగా సిద్ధం చేశారు. రూ.25 వేల నగదు, బంగారు ఉంగరాన్ని ఆ వృద్ధ పెళ్లికొడుకు పువాంగ్ తీసుకున్నాడు.
ఇండోనేషియాలో పెద్ద వయసున్న పురుషులు, చిన్న వయసున్న యువతుల్ని పెళ్లాడటం సర్వసాధారణం. అందుకే వారిరువురి కుటుంబసభ్యులు పెళ్లికి అడ్డు చెప్పకుండా అంగీకరించారు. అయితే ఏకంగా 76 ఏళ్ల వయసు వ్యత్యాసంతో జరిగిన పెళ్లిమాత్రం ఇదొక్కటే. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరలైంది.