Begin typing your search above and press return to search.
అమరావతి శంకుస్థాపనకు అతిరథమహారథులు
By: Tupaki Desk | 16 Sept 2015 11:41 AM IST నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర శంకుస్థాపన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న నగరం కావడంతో శంకుస్థాపన కార్యక్రమం కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ చేతల మీదగా అక్టోబర్ 22న దసరా రోజున రాజధానికి శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సింగపూర్ - జపాన్ ప్రధానులు కూడా హాజరుకానున్నారు. దేశంలో పలువురు సీఎంలు - గవర్నర్ లు కూడా వస్తారు.
తుళ్లూరు మండలానికి ఈశాన్య ప్రాంతంలో మందడం-వెంకటపాలెం గ్రామల మధ్యలో శంకుస్థాపన ఉంటుంది. జూన్ 6న జరిగిన రాజధాని భూమి పూజకు స్ధల నిర్ణయం చేసిన రాఘవయ్యే సిద్ధాంతే శంకుస్ధాపన పూజలూ చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో అధికారులు ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించి మందడం-వెంకటపాలెం గ్రామాల మధ్య ఉన్న పొలిమేర ప్రాంతం శంకుస్థాపనకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. అక్టోబర్ 22న మధ్యాహ్నం 12 గంటలు దాటాకే శంకుస్థాపన చేస్తారు. రాజధాని నిర్మాణానికి గుర్తుగా విజయవాడ-అమరావతి కరకట్ట పక్కనే ఉన్న విజయవాడ పీడబ్లూడీ వర్క్ షాపు నుంచి 6.2 కిలోమీటర్ల దూరంలో పైలాన్ నిర్మిస్తారు. శంకుస్థాపనకు ప్రధాని మోడీతో పాటు సింగపూర్ - జపాన్ ప్రధానులు రానుండడం... వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు - గవర్నర్ లు - సుమారు 15 మంది కేంద్ర మంత్రులు... ఇంకా చాల మంది ప్రముఖులు రానుండడంతో గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్ క్యాటగిరీ - జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నవారు సుమారు 50 మంది వస్తారని అంచనా.