Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను ఎంతలా పొగిడేస్తున్నారంటే..
By: Tupaki Desk | 18 Dec 2017 1:15 PM ISTగుండెల్లో ఎంత అభిమానం ఉంటే మాత్రం.. పెదవి దాటి వచ్చే కాంప్లిమెంట్ అవతలోళ్ల మనసుల్లో రిజిస్టర్ అవుతోంది. గతంలో ఏదైనా సందర్భం వస్తే.. తాము అభిమానించే పెద్దోళ్లను అభినందించటానికి మీడియా దగ్గర క్యూ కట్టేశారు. ప్లీజ్ అండి.. మా పేరు వచ్చేలా చూడండి. మా పేరు కనిపించకుంటే నలుగురు అభినందించలేదనుకుంటారంటూ పలువురు ప్రముఖులు మీడియా వాళ్లను బతిమిలాడేవారు.
ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ప్రముఖుడే కాదు.. సామాన్యుడు సైతం ప్రముఖులకు దగ్గరయ్యారు. తమ పోస్టింగులతో వారి మనసుల్ని దోచుకుంటున్నారు. ఇలాంటి వేళ.. ఎవరికైనా ఏదైనా పురస్కారం వచ్చినా.. ఏదైనా సాధిస్తే పోటాపోటీగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక.. ప్రముఖులకైతే తప్పనిసరిగా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ఫ్యూచర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలువురు అభివర్ణించే కేటీఆర్ కు ఒక అవార్డును సాధించటం తెలిసిందే. దేశంలో అతి పెద్ద మ్యాగజైన్ అయిన బీడబ్ల్యూబీ బిజినెస్ వరల్డ్ ప్రకటించిన లీడర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైన కేటీర్ ను పొగడ్తలతో ముంచెత్తటానికి ప్రముఖులు.. సామాన్యులు పోటీ పడుతున్నారు.
ఈ నెల 20న.. (బుధవారం) ఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో కేటీఆర్ కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముబారక్.. మీరీ అవార్డుకు అర్హులే అంటూ హైదరాబాద్ ఎంపీ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానిస్తే.. కంగ్రాట్స్ సర్ అంటూ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొన్నారు. ఇక.. యువ నటుడు విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. రామన్నా.. లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించినందుకు కంగ్రాట్స్. మీ అవసరం మాకు చాలా ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ అభినందించారు. ఇక.. మంచు విష్ణు కంగ్రాట్స్ చెబుతూ.. మై బ్రదర్.. ఇలాంటి అవార్డులు మీరు మరిన్ని అందుకోవాలి.. తెలుగు ప్రరజలు గర్వించాల్సిన క్షణమంటూ పేర్కొన్నారు.
కేటీఆర్ కు అభినందనలు తెలిపిన వారిలో హరీశ్ శంకర్.. కోన వెంకట్.. వెన్నెల కిశోర్.. అనిల్ రావిపూడి.. బీవీఎస్ రవి తదితరులు ఉన్నారు. విజయ్ దేవరకొండ చెప్పినట్లు.. కేటీఆర్ అవసరం ఎవరికెంత ఉందో ఎవరికి మాత్రం తెలీదు చెప్పండి.