Begin typing your search above and press return to search.
రాసలీలల కేసు: జార్కిహోళికి కరోనా..కేసులో ట్విస్ట్
By: Tupaki Desk | 6 April 2021 3:41 PM ISTకర్ణాటకలో కలకలం సంచలనం సృష్టించిన రాసలీలల వీడియో సిడీ కేసులో ఇరుక్కున్న కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆదివారం రాత్రి ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది.
బెళగావి జిల్లా గోకాక్ లో ఆస్పత్రిలో ఐసీయూలో జార్కిహోళి చేరారు. మరో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. ఇక జార్కిహోళి రక్తంలో హిమో గ్లోబిన్ శాతం పడిపోయినట్లు గుర్తించారు. అందుకే ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. బీపీ, షుగర్ నియంత్రణలోకి రాలేదని తెలిపారు.
ఇక కరోనా కారణంగానే జార్కిహోళి బెంగళూరులో సిట్ విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఆయన సిట్ విచారణకు రాకపోవడం ఇది నాలుగోసారి.
ఇక రాసలీలల వీడియో సిడీ కేసులో బాధిత యువతి స్పందించింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కోర్టులో తెలిపింది. తమ కుమార్తె కిడ్నాప్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు బెంగళూరు ఆర్టీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సంగతి తెలిసిందే. ఆమె సోమవారం కోర్టుకు హాజరై తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసింది.