Begin typing your search above and press return to search.

రాస‌లీల కేసుః యువతిని బెడ్ రూమ్ కు తీసుకెళ్లిన సిట్‌ అధికారులు!

By:  Tupaki Desk   |   2 April 2021 1:00 PM IST
రాస‌లీల కేసుః యువతిని బెడ్ రూమ్ కు తీసుకెళ్లిన సిట్‌ అధికారులు!
X
క‌ర్నాట‌క జ‌ల‌వ‌న‌రుల మాజీ మంత్రి ర‌మేష్ జార్కి సెక్స్ వీడియోల వ్య‌వ‌హారంలో సిట్ అధికారులు ప్ర‌వేశించారు. ఏం జ‌రిగింది? ఎలా జ‌రిగింది? వెనుక ఎవ‌రున్నారు? వంటి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు అధికారులు. ఈ క్ర‌మంలో వీడియో షూట్ చేసిన బెడ్ రూమ్ కు స‌ద‌రు యువ‌తిని తీసుకెళ్లి దాదాపు ఐదు గంట‌ల‌పాటు ప్ర‌శ్నించిన‌ట్టు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు వీడియోలు, ప‌లు ఆడియో టేపులు కూడా వ‌దిలిన యువ‌తి.. మాజీ మంత్రి ర‌మేష్ జార్కిపై కేసు న‌మోదు చేయాల‌ని కోరిన విష‌యం తెలిసిందే. త‌న న్యాయ‌వాది ద్వారా పోలీసు క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు లేఖ‌ను పంపుతున్నాన‌ని, దాని ఆధారంగా కేసు న‌మోదు చేయాలని కోరింది. త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన త‌ర్వాతే బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని, సిట్ అధికారుల ముందు కూడా హాజ‌ర‌వుతాన‌ని ఆ వీడియోలో చెప్పిన‌ట్టుగా తెలిసింది.

దీంతో.. రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. జార్కి హోళీ, స‌ద‌రు యువ‌తి ఏకాంతంగా గ‌డిపిన బెడ్ రూమ్ కు వెళ్లార‌ట‌. మ‌ల్లేశ్వ‌రం స‌మీపంలోని ఓ విలాస‌వంత‌మైన అపార్ట్ మెంట్లో ఈ వ్య‌వ‌హారం సాగిన‌ట్టు స‌మాచారం. అది ర‌మేష్ జార్కీకి చెందిన అపార్ట్ మెంట్ అని తెలుస్తోంది. అక్క‌డికి స‌ద‌రు యువ‌తిని కూడా తీసుకెళ్లి అధికారులు సోదాలు నిర్వ‌హించార‌ట‌. ఆ త‌ర్వాత యువ‌తికి ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన‌ట్టు స‌మాచారం.

స‌ద‌రు యువ‌తి ఆ అపార్ట్ మెంట్ కు ఎన్నిసార్లు వ‌చ్చింది? ఆమె వెంట మ‌రెవ‌రైనా ఉన్నారా? అస‌లు మంత్రి అపార్ట్ మెంట్ కు కెమెరాను ఎవ‌రు తేగ‌లిగారు? ఎక్క‌డ ఫిక్స్ చేశారు? తిరిగి దాన్ని ఎలా తీసుకోగ‌లిగారు? వంటి వివరాలన్నీ సిట్ అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం.

సదర యువతితోపాటు అపార్ట్ మెంట్ సెక్యూరిటీ నుంచి కూడా వివరాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. సదరు యువతి కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని సమాచారం. దీంతో.. ఇవాళ కూడా విచారణ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.