Begin typing your search above and press return to search.

మూడు నాలుగుసార్లు మంత్రి రేప్ చేశాడు.. సిట్ విచారణలో యువతి సంచలనం?

By:  Tupaki Desk   |   1 April 2021 12:28 PM IST
మూడు నాలుగుసార్లు మంత్రి రేప్ చేశాడు.. సిట్ విచారణలో  యువతి సంచలనం?
X
కర్ణాటకలో సంచలనం రేపుతోన్న రాసలీలల సీడీ కేసులో ఎట్టకేలకు మంత్రితో శృంగారం జరిపిన బాధిత యువతి అజ్ఞాతం వీడింది. మంగళవారం బెంగళూరులోని మెజిస్ట్రేట్ లో బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు. బుధవారం సిట్ అధికారులు ఆమెను విచారించారు.

మాజీ మంత్రి రమేశ్ జర్కిహోళితో పరిచయం.. ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎవరు ఒత్తిడి చేశారనే ప్రశ్నలను సిట్ సంధించింది. ‘కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం కోసం మొదటిసారి విధాన సౌధకు వెళ్లినప్పుడు మంత్రి జర్కిహోళి కలిశారని.. ఆయన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చారని.. ఆ నంబర్ మరెవరికి ఇవ్వొద్దన్నారని బాధిత యువతి సిట్ విచారణ అధికారులకు తెలిపింది.

కొద్దిరోజులకు శారీరకంగా తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చారని.. రెండు మూడు సార్లు ఫ్లాట్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి తెలిపింది. సీనియర్ మంత్రి కావడంతో ఎవరికి చెప్పే ధైర్యం చేయలేక తాను భయపడి మౌనంగా ఉండిపోయానని బాధిత యువతి సిట్ అధికారులకు వెల్లడించింది.

మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడినప్పుడు వీడియో కూడా తీశాడని.. దాన్ని అతడి వద్దే పెట్టుకొని పిలిచినప్పుడల్లా రావాలని బెదిరించాడని యువతి తెలిపింది. దీంతో ఆయనకు భయపడి వెళ్లాల్సి వచ్చిందని వివరించింది. జర్కిహోలి అసభ్యంగా తిట్టేవాడని.. అతడి ప్రవర్తన తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని వాపోయింది.

ఈ విషయాన్ని నా కొలిగ్ శ్రావణ్ కు చెప్పానని.. అతడి ద్వారా నరేశ్ పరిచయం అయ్యాడని.. సాక్ష్యాధారాలు లేకుండా కేసు పెట్టలేమని వాళ్లు చెప్పినట్లు వెల్లడించింది. దీంతో మరోసారి మంత్రి వద్దకు వెళ్లినప్పుడు తాను కూడా వీడియో రికార్డు చేసుకున్నానని.. ఒక కాపీ నా వద్ద పెట్టుకొని మరో కాపీ నరేష్ కు ఇచ్చానని తెలిపింది. దీంతో ఆ వీడియో ఎవరు లీక్ చేశారో నాకు తెలియదు అని ఆమె వాపోయింది.

విచారణ అనంతరం బాధితురాలిని కట్టుదిట్టమైన భద్రత మధ్య అజ్ఞాత స్థలానికి పోలీసులు తరలించారు.