Begin typing your search above and press return to search.

మంత్రి రాసలీల కేసులో మూడో వీడియో..!

By:  Tupaki Desk   |   27 March 2021 10:16 AM IST
మంత్రి రాసలీల కేసులో మూడో వీడియో..!
X
క‌ర్నాట‌క జ‌ల‌వ‌న‌రుల మాజీ మంత్రి ర‌మేష్ జార్కి సెక్స్ వీడియోల వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం రేకెత్తించిందో తెలిసిందే. రాష్ట్రంలో రాజ‌కీయంగా పెను దుమారం రేపిన ఈ వ్య‌వ‌హారం కార‌ణంగా.. ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి కూడా రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. అయితే.. ఈ కేసులో తాజాగా మూడో వీడియో రిలీజ్ చేసిందట‌ బాధిత యువ‌తి.

ఆ వీడియోలో మాజీ మంత్రి ర‌మేష్ జార్కిపై కేసు న‌మోదు చేయాల‌ని కోరిందట‌. తాను అజ్ఞాతంలో ఉన్నాన‌ని, అందువ‌ల్ల త‌న న్యాయ‌వాది ద్వారా పోలీసు క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు లేఖ‌ను పంపుతున్నాన‌ని, దాని ఆధారంగా కేసు న‌మోదు చేయాలని కోరిందని స‌మాచారం. ఆ వీడియోను, ఫిర్యాదు కాపీని తీసుకొని లాయ‌ర్ జ‌గ‌దీష్ కుమార్ బెంగ‌ళూరు న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ క‌మ‌ల్ పంత్ ను క‌లిశారని తెలుస్తోంది. ఆ వీడియో చూసి, ఫిర్యాదు లేఖ‌ను చ‌దివిన త‌ర్వాత పోలీసులు మాజీ మంత్రి ర‌మేష్ పై ఎఫ్ఐఆర్‌ న‌మోదుచేసిన‌ట్టు స‌మాచారం.

కాగా.. వీడియో విడుద‌ల చేసిన కాసేప‌టికే ఆ యువ‌తి పేరిట‌ ఓ ఆడియో కూడా విడుద‌లైందట‌. అందులో కేపీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ పేరు ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో.. ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప‌రిణామాల‌పై స్పందించిన ర‌మేష్ జార్కీ.. స‌మ‌స్య‌ను ధైర్యంగా ఎదుర్కొంటాన‌ని, రేప‌టి నుంచి త‌న వ‌ద్ద ఉన్న అస్త్రాల‌ను వ‌దులుతాన‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల్చిన త‌ర్వాతే త‌మ‌పై కుట్ర మొద‌లైంద‌ని ఆరోపిస్తున్నార‌ట‌.