Begin typing your search above and press return to search.
కర్ణాటక రాసలీలల కేసు...కేపీసీసీ చీఫ్‌తో సీడీ నిందితుడు
By: Tupaki Desk | 18 March 2021 10:00 PM ISTడీకే శివకుమార్ కి కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా మంచి గుర్తింపు ఉంది. అలాగే అయన కేపీసీసీ అధ్యక్షుడు కూడా. ఏ సందర్భంలో అయినా సరే చాకచక్యంగా వ్యవరిస్తూ పార్టీకి అవసరమైయ్యేలా మెలగడంలో ఆయనకి ఆయనే సాటి. అలాంటి డీకే శివకుమార్ పై ప్రస్తుతం రాసలీలల బాగోతంలో ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి వీడియో కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్ గౌడ, డీకే శివకుమార్ తో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోను కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్ లో పోస్టు చేసి ఒకే ఫ్రేమ్ లో మాస్టర్ మైండ్– రింగ్ మాస్టర్ ఉండటం ఏమిటి అని సెటైరికల్ విమర్శలు కురిపిస్తుంది. కాగా, నరేశ్‌గౌడ సిట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ... కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహోలీ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో కొద్దిరోజుల క్రితం వెలుగులోకి రావడం సంచలన సృష్టించింది. దీంతో రమేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. తాజాగా, యువతి ప్రియుడు ఆకాశ్ సోమవారం సిట్ ముందు హాజరయ్యాడు. ఆమె ప్రేమ మైకంలో మునిగిపోయానని, తనకు అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసిందని , అంతేకాదు, సీడీ రికార్డింగ్ గురించి ఆమెకు తెలుసని, ఆ విషయం తనకు చెప్పలేదని అన్నాడు. సీడీ చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు లాగడానికి ప్లాన్ వేశారని తనకు తరువాత తెలిసిందని చెప్పాడు.
సీడీలోని యువతి హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, సమాజంలో నా పరువు పోయిందని, రక్షణ కల్పించాలని... నా తల్లిదండ్రులు, నేను పలుమార్లు ఆత్మహత్యకు యత్నించామంటూ హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మైకు ఆమె వీడియోలో విన్నవించుకుంది. ఉద్యోగం కోసమే రమేశ్ జార్కిహొళిని కలిశానని తెలిపింది. ఈ వీడియోలో ఉన్న యువతిగా చెప్పుకుంటున్న యువతి తండ్రి.. బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ప్రమాదంలో ఉందని ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో టీవీలో కనిపించగానే.. తాను తన కూతురుకు ఫోన్ చేశానని బాధితురాలి తండ్రి చెప్పారు. అయితే ఆ వీడియోలో ఉంది తాను కాదని.. అది నకిలీ వీడియో అని తన కూతురు తనకు చెప్పిందని అన్నారు. అంతేకాదు తన జీవితం ప్రమాదంలో ఉందని, ఇప్పుడు బయటకు రాలేనని తన కూతురు చెప్పినట్టు బాధితురాలు తండ్రి వ్యాఖ్యానించారు. ఆ తరువాత నుంచి ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యిందని పేర్కొన్నారు. తమ కూతురు ఏమైందో చెప్పాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. మార్చి 2 కంటే ముందే బెంగళూరులోని హాస్టల్ నుంచి తన కూతురును కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని బాధితురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.