Begin typing your search above and press return to search.
సీడీలో యువతి లవ్వర్ ఏం చెప్పాడు?
By: Tupaki Desk | 16 March 2021 1:00 PM ISTఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేశ్ జార్కిహోళి తనను లొంగదీసుకున్నట్లుగా యువతి సంచలన వ్యాఖ్యలు చేయటం.. అందుకు తగ్గట్లే ఆన్ లైన్ లో దానికి సంబంధించిన సీడీ వైరల్ కావటంతో మంత్రివర్యులు పదవి పోగొట్టుకున్నారు. అనంతరం..సదరు యువతి ఆచూకీ లభించలేదు. గడిచిన రెండు రోజులుగా సీడీలో ఉన్న యువతి గురించిన వివరాల్ని సేకరించే పనిలో బిజీగా ఉన్న బెంగళూరు .. ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లారు.
సీడీలో కనిపించిన యువతికి ఒక ప్రియుడు ఉన్నాడని.. అతడి పేరు ఆకాశ్ అన్న విషయాన్ని గుర్తించారు. తాజాగా అతను సిట్ విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా సదరు యువతిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను సదరు యువతి ప్రేమ మైకంలో మునిగిపోయానని.. అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసినట్లుగా అతడు చెప్పినట్లుగా తెలుస్తోంది.
మంత్రితో రాసలీలల సమయంలో సీడీ రికార్డింగ్ గురించి ఆమెకు తెలుసన్న విషయాన్ని ఆకాశ్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తనకీ విషయాలు తొలుత తెలీవని.. తర్వాత తెలిసాయన్నారు. సీడీ చూపించి డబ్బులు గుంజటానికి పథకం వేశారని తనకు తర్వాత తెలిసిందన్నారు. రాసలీలల వీడియోపై విచారిస్తున్న అధికారులు.. ఆమెకు ఆకాశ్ అనే ప్రియుడు ఉన్నట్లు గుర్తించి.. అతడ్ని విచారణకు పిలిచారు.
అనంతరం ఆమె ఉన్న 70 సీసీ కెమేరాల్లోని ఫీడ్ ను చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు అంశాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఆమె ఎక్కడెక్కడ తిరిగిన విషయాల్ని గుర్తించటంతో పాటు.. కొన్ని వీడియోల్ని విచారణ కోసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీడీ విడుదలకు ముందు.. ప్రియుడు ఆకాశ్ తో కలిసి పలువురు మీడియా సంస్థల ప్రతినిధులతో భేటీ అయినట్లుగా గుర్తించారు. ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు.