Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ ఎంత సీరియస్ అంటే.. తెగ ప్రాణాల్ని తీసేస్తోందట

By:  Tupaki Desk   |   11 Nov 2020 9:30 AM IST
సెకండ్ వేవ్ ఎంత సీరియస్ అంటే.. తెగ ప్రాణాల్ని తీసేస్తోందట
X
మనం సీరియస్ గా తీసుకోవటం లేదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఒక ఊపు ఊపేస్తోంది. పలు దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదువుతున్నాయి. మన దగ్గర సెకండ్ వేవ్ ఇంకా షురూ కాలేదనే చెప్పాలి. కేరళ లాంటి ఒకట్రెండు రాష్ట్రాల్లో మొదలైనట్లు చెబుతున్నా.. దాని తీవ్రత మనకు ఇంకా అర్థం కాలేదనే చెప్పాలి.

రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా కేసులు తగ్గిపోవటం.. రికవరీ ఎక్కువ కావటంతో చాలామందిపెద్దగా పట్టించుకోవటం లేదు. ఆ మాటకు వస్తే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నిర్లక్ష్యం ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న విషయం తాజాగా నమోదవుతున్న కేసులు.. చోటు చేసుకుంటున్న మరణాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి.

చలికాలంలో షురూ అయిన ఈ సెకండ్ వేవ్ ముప్పు ఎక్కువన్న మాట వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజులో నమోదైన కొత్తకేసులు ఎన్నో తెలుసా? అక్షరాల రూ.5.33లక్షల కేసులు. దీంతో కరోనా బారిన ఇప్పటివరకు పడిన వారి సంఖ్య 5.17కోట్లు. నిన్న ఒక్కరోజునే 9వేల మంది మరణించారు. కరోనా షురూ అయ్యాక.. ఒక్కరోజులో దీని బారిన పడి ఇంత భారీగా మరణాలుచోటు చేసుకోవటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12.78 లక్షలకు చేరుకున్నట్లైంది.

ప్రస్తుతం నెలకొన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన ప్రతి వంద మందిలో ఇద్దరు లేదంటే ముగ్గురు కచ్ఛితంగా చనిపోతున్నారు. ఈ లెక్కలో చూస్తే.. మన దగ్గర మరణాలు సంఖ్య తక్కువగానే ఉందని చెప్పాలి. ప్రపంచంలో అత్యధిక కేసుల నమోదు చూస్తే.. అమెరికాలో అత్యధికంగా ఉంది. అక్కడ నిన్నటి రోజున 1.32లక్షల కొత్త కేసులునమోదుకాగా.. నిన్న ఒక్కరోజులో చోటుచేసుకున్న మరణాలు 1316 కావటం గమనార్హం.

అమెరికా తర్వాత పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నదేశాల్లో భారత్.. ఇటలీ.. బ్రెజిల్.. పోలాండ్.. ప్రాన్స్.. రష్యాలు ఉన్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్.. ఇటలీ.. బ్రిటన్ లు ఉన్నాయి. మరణాల్ని చూస్తే.. అమెరికా తర్వాత అత్యధిక మరణాలుయూరోప్ దేశాల్లోనే ఉండటం గమనార్హం. ఈ ట్రెండ్ చూస్తే.. సెకండ్ వేవ్ ను చాలా సీరియస్ గా తీసుకోవటమే కాదు.. ఫస్ట్ వేవ్ కంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.