Begin typing your search above and press return to search.

సుప్రింకోర్టు పరిధిలోకి సీబీఐ ?

By:  Tupaki Desk   |   2 Oct 2021 1:03 PM IST
సుప్రింకోర్టు పరిధిలోకి సీబీఐ ?
X
తాజాగా జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్యలు ఇందుకు వత్తాసు పలుకుతున్నాయి. ఇప్పటికే సీబీఐ పనితీరుపై సుప్రంకోర్టుతో పాటు మామూలు జనాల్లో కూడా చాలా అనుమానాలున్నాయి. ఒకపుడు సీబీఐ దర్యాప్తంటే బ్రహ్మాండమని అనుకనే వారు మామూలు జనాలు. ఏ కేసు విచారణలో అయినా సీబీఐ అధికారులు రంగంలోకి దిగబోతున్నారంటే ఇంకేముంది దోషులెవరో తేలిపోతుందని అందరు అనుకునే వారు.

అలాంటి పరిస్ధితి నుండి సీబీఐ దర్యాప్తు అంటేనే దోషులు ఇపుడు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకునేట్లుగా తయారైంది. ఈ పరిస్దితి ఎందుకు వచ్చిందంటే సీబీఐ అధికారపార్టీకి వత్తాసు పలకటమ అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సీబీఐ అంటే పంజరంలో చిలుకని, అధికారంలో ఉన్నవారి చేతిలో కీలుబొమ్మలాగ తయారైందని సుప్రింకోర్టే వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు దాని పనితీరుకు అద్దం పడుతున్నాయి.

ఇలాంటి నేపధ్యంలోనే తాజా ఓ కేసు విచారణ సందర్భంగా నేర దర్యాప్తు కోసం సుప్రింకోర్టే సీబీఐ ని నియమిస్తే బౌండరీ సమస్యలు తలెత్తవని సర్వోన్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. ఒక్క బౌండరీ సమస్యలే కాదు కేసుల విచారణను అధికారపార్టీ ఎలా ప్రభావితం చేస్తోందో గతంలో చాలా సార్లు నిరూపణైంది. ప్రతిపక్షంలోని నేతలు అధికారపార్టీలో చేరిపోగానే వారిపైన జరుగుతున్న కేసుల దర్యాప్తు అటకెక్కిపోతోంది.

పశ్చిమబెంగాల్లో తృణమూల్ ఎంపీలు, ఎంఎల్ఏలపై సీబీఐ నమోదుచేసిన కేసులు, దర్యాప్తు వాళ్ళు బీజేపీలో చేరగానే అటకెక్కిపోయింది. అలాగే ఏపిలో టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళపైన నమోదైన సీబీఐ కేసులు, దర్యాప్తు బీజేపీలోకి ఫిరాయించగానే ఏమైందో ఎవరికీ అర్ధం కావటంలేదు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా ప్రత్యర్ధులపై కేసులు పెట్టడం, వాళ్ళు తమ పార్టీలో చేరగానే దర్యాప్తులు ఆగిపోవటం లాంటి అనేక ఘటనలు మనదేశంలో ఉన్నాయి.

ఇందుకనే సీబీఐని కేంద్రం పరిధిలో నుండి తప్పించి స్వంతంత్ర సంస్ధగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ అందరికీ తెలిసిందే. అలాంటి తాజాగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలతో సీబీఐని సర్వోన్నత న్యాయస్ధానం పరిధిలోకి తీసుకువస్తే కక్షసాధింపులు తగ్గిపోయి బాధితులకు వెంటనే న్యాయం జరుగుతుందని వాదన పెరుగుతోంది. మరి సుప్రింకోర్టు చివరకు ఏమి చేస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే సుప్రింకోర్టు ఆలోచనలను కేంద్రప్రభుత్వం ఆమోదించాలి కదా.