Begin typing your search above and press return to search.

విద్యుత్ శాఖ ఏఈ ఇంట్లో సిబిఐ సోదాలు .. భారీగా అక్రమాస్తులు !

By:  Tupaki Desk   |   28 Jan 2021 5:37 PM IST
విద్యుత్ శాఖ ఏఈ ఇంట్లో సిబిఐ సోదాలు .. భారీగా అక్రమాస్తులు !
X
విశాఖపట్నం లో విద్యుత్ శాఖ ఏఈ ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ ఏఈతో పాటూ బంధువులు ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలో సీతమ్మధార, సీతమ్మ పేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లిలో మొత్తం ఏడు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన మూడు బ్యాంకు లాకర్లు, ఆస్తులు, భూములను ఏసీబీ గుర్తించింది.

ఆంధ్ర, తెలంగాణలో ఏఈ నాగేశ్వరరావుకు కోట్లాది రూపాయల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన బంధువుల పేరిట హైదరాబాద్‌ తో పాటు ఏపీలోని పలుచోట్ల ఇళ్లస్థలాలు ఉన్నట్లు అధికారులు సిబిఐ అధికారులు గుర్తించారు. విశాఖ జిల్లా కొమ్మాది డివిజన్‌ విద్యుత్‌ ఏఈగా నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. 1991లో నాగేశ్వరరావు సర్వీసులో చేరారు. అయితే , 1994లోనే తొలిసారిగా ఏసీబీకి చిక్కడంతో సస్పెండ్ అయ్యారు.

అయినప్పటికీ, తీరుమారకపోవడంతో పూర్తిగా విధుల నుంచి పక్కన పెట్టారు. దాదాపు 15 ఏళ్లపాటు ఆయన విధులకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2012లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీతో ఏఈ ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు.