Begin typing your search above and press return to search.
ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు?
By: Tupaki Desk | 1 Feb 2021 10:00 PM ISTఅధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
గతంలో కోర్టులు, జడ్జీలను విమర్శించిన కేసులో ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. గతంలో న్యాయస్థానానికి దురుద్ధేశాలను ఆపాదిస్తూ.. న్యాయమూర్తులను దూషిస్తూ.. వారిని ముక్కులుగా నరకాలి అని హెచ్చరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అయితే సోషల్ మీడియాలో జడ్జీలను దూషించిన వారిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 49 మందికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేశారు. వీరిలో అధికార పార్టీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. జడ్జిలను దూషించిన కేసులో ఇప్పటికే వైసీపీ అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ పై మాత్రమే కేసులు కాగా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకు సీబీఐ నోటీసులు అందడం చర్చనీయాంశమైంది.