Begin typing your search above and press return to search.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ.. స్పందించిన స్వరూపానంద

By:  Tupaki Desk   |   11 Sept 2020 9:05 AM IST
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ.. స్పందించిన స్వరూపానంద
X
ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీఎం జగన్ నిన్న రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. బీజేపీ-జనసేన ఈ అంతర్వేది రథం దగ్ధం విషయంలో పోరుబాట పట్టాయి. పవన్ కళ్యాణ్ తోపాటు బీజేపీ నేతలు దీక్షలు చేపట్టారు. బీజేపీ స్వయంగా రంగంలోకి దిగింది. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు.

అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్వాగతించారు. సీఎం జగన్ హిందూధర్మ పరిరక్షకుడు అంటూ కొనియాడారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంతర్వేది అంశంపై సీబీఐ విచారణ ఆదేశాలు జారీ చేయడం సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. దీనివెనుక అసలు కుట్ర బయడపడుతుందని ఆయన అన్నారు. అంతర్వేది ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని సీబీఐ నిగ్గు తేలుస్తుందని చెప్పారు. ఇది హిందువులు హర్షించదగ్గ నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

హిందూ ధర్మ పరిరక్షణకోసం ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం అభినందనీయమని స్వరూపానంద తెలిపారు. ఇక ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద కూడా ఈ ఘటనపై సీబీఐ విచారణను స్వాగతించారు.

ఏపీలోని ప్రముఖ హిందూ దేవాలయం అయిన అంతర్వేదిలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని రథం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వామి వారి ఉత్సవ రథం అగ్నికి ఆహుతైంది. కాగా ఇలా రథం అగ్నికి ఆహుతి కావడం అరిష్టమని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ దీనిపై కీలక నిర్ణయం తీసుకొని సీబీఐకి అప్పగించింది.