Begin typing your search above and press return to search.

మోడీ విశ్వ‌రూపం.. సీబీఐ చీఫ్ కు మ‌ళ్లీ షాక్!

By:  Tupaki Desk   |   11 Jan 2019 6:15 AM GMT
మోడీ విశ్వ‌రూపం.. సీబీఐ చీఫ్ కు మ‌ళ్లీ షాక్!
X
ఆయ‌న మోడీ. ఎవ‌రి మాట విన‌రు. అయితే.. గియితే.. అంద‌రూ ఆయ‌న మాటే వినాలి. భ‌ర‌త‌జాతిని ఉద్ద‌రించ‌టానికే పుట్టిన‌ట్లుగా చెప్పుకునే క‌మ‌ల‌నాథులు... మోడీతోనే ఈ దేశం అత్యున్న‌త స్థితికి చేరుకుంటుంద‌ని న‌మ్మే కోట్లాది మంది అండ ఉన్న‌ప్పుడు మోడీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు ఎలా ఉంటాయి? అన్న దానికి తాజాగా ఆయ‌న స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది.

సీబీఐ చీఫ్ గా ఉన్న అలోక్ వ‌ర్మ‌ను నిర్బంధ సెల‌వుపై పంపిన తీరును త‌ప్పు ప‌ట్టిన సుప్రీంకోర్టు.. ఆయ‌న్ను మ‌ళ్లీ సీబీఐ డైరెక్ట‌ర్ గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం.. ఆ వెంట‌నే అలోక్ వ‌ర్మ ప‌ద‌విని చేప‌ట్ట‌టం తెలిసిందే. మోడీ లాంటి నేత ప్ర‌ధాని కుర్చీలో కూర్చొని తీసుకున్న‌నిర్ణ‌యం త‌ప్ప‌ని సుప్రీం తేల్చిన‌ప్పుడు ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతార‌న్న విష‌యాన్ని 48 గంట‌ల్లోనే చెప్పేశారు. త‌న‌కు న‌చ్చ‌ని అలోక్ వ‌ర్మ సీబీఐ డైరెక్ట‌ర్ కుర్చీలో కూర్చోవ‌టం.. తాను అర్థ‌రాత్రి వేళ డిసైడ్ అయిన నాగేశ్వ‌ర‌రావును ఇంటికి పంప‌టం మోడీ మాష్టారికి అస్స‌లు న‌చ్చ‌న‌ట్లుంది.

అంతే.. క‌ద‌పాల్సిన పావుల్ని క‌దిపిన మోడీ కార‌ణంగా.. సీబీఐ డైరెక్ట‌ర్ కుర్చీలో కూర్చున్న అలోక్ వ‌ర్మ 48 గంట‌లు గ‌డిచే స‌రికి.. కూర్చున్న కుర్చీని వ‌దిలేసి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. సుప్రీం నిర్ణ‌యాన్ని మోడీ త‌న‌దైన స్టైల్ లో డీల్ చేయ‌టంతో సీన్ మొత్తం మారిపోయింది.

సుప్రీం తీర్పు నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని ఉన్న‌తాధికార క‌మిటీ అలోక్ వ‌ర్మ‌ను సీబీఐ డైరెక్ట‌ర్ ప‌దవి నుంచి త‌ప్పించాలంటూ 2-1 మెజార్టీతో నిర్ణ‌యించింది. ఇంత‌కీ ఈ క‌మిటీలో ఎవ‌రెవ‌రు ఉంటారంటే.. ప్ర‌ధాని మోడీ.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సిక్రీతోపాటు.. విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు ఉన్నారు. ఈ బృందం 2-1 ఓట్ల తేడాతో అలోక్ ను ఇంటికి పంపాల‌ని డిసైడ్ చేశారు. మ‌ల్లికార్జున ఖ‌ర్గే అలోక్ కు అనుకూలంగా ఓటేసినా.. వేయాల్సిన వారు వేయ‌క‌పోవ‌టంతో ఆయ‌న సీబీఐ డైరెక్ట‌ర్ కుర్చీని ఖాళీ చేయాల్సి వ‌చ్చింది.

మోడీ మాష్టారికి న‌చ్చ‌కుండా ఎవ‌రు మాత్రం ఎంత‌కాల‌మ‌ని అత్యున్న‌త స్థానాల్లో ప‌ని చేయ‌గ‌ల‌రు? ఉన్న‌త స్థానాల్లో తాను కోరుకున్న వారు త‌ప్పించి.. వ్య‌వ‌స్థ‌లు చెప్పిన వారు కూర్చోకూడ‌ద‌న్న మొండిత‌నం ఉన్న మోడీ లాంటి నేత అధినేత‌గా ఉంటే ఇప్పుడు చోటు చేసుకున్నవే చోటు చేసుకుంటాయి. ఇంత‌కీ అలోక్ వ‌ర్మ‌ను సీబీఐ డైరెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి తీసివేయ‌టానికి కార‌ణాలేమిటన్న దానికి చూపించిన‌వి ఏమిటో తెలుసా? గురుగ్రామ్ లో ఒక భూమి వివాదానికి సంబందించిన అంశం.. దీన్లో రూ.36 కోట్లు మారిన‌ట్లుగా ఆరోప‌ణ‌తో పాటు.. ఐఆర్ సీటీసీ స్కాంలో ఒక పేరును ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా త‌ప్పించ‌టం..లాంటి కొన్ని అంశాల్ని చూపించారు. రాజుకు న‌చ్చ‌నోడు.. స‌ద‌రు రాజుగారి రాజ్యంలో ప‌ని చేయ‌గ‌ల‌డా?