Begin typing your search above and press return to search.

గిరిజన టీచర్ సూసైడ్ .. అది ఆత్మహత్య ఎలా అవుతుంది , సీబీఐకి ఎమ్మెల్యే సీతక్క , నెటిజన్లు డిమాండ్ !

By:  Tupaki Desk   |   16 Sep 2020 2:00 PM GMT
గిరిజన టీచర్ సూసైడ్ .. అది ఆత్మహత్య ఎలా అవుతుంది , సీబీఐకి ఎమ్మెల్యే సీతక్క , నెటిజన్లు డిమాండ్ !
X
విజయనగరంలో ఒక గిరిజన టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు ఏకంగా మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అది ఆత్మహత్య కాదని, ఎవరైనా హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అనుమానం చాలామంది చేస్తుండటంతో ఈ కేసు పై సీబీఐతో విచారణ చేయించాలనే డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. సీబీఐ విచారణ జరిపిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, ఆ గిరిజన టీచర్ చావు కి తగ్గ న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుని ఇటీవలే కాలంలో మరణించిన బాలీవుడ్ యువహీరో సుశాంత్ తో ఆత్మహత్యతో పోల్చుతున్నారు. ఈ ఘటనపై ఏపీ, తెలంగాణ సహా ఆ ఉపాధ్యాయుడి స్వరాష్ట్రం రాజస్థాన్‌లో కలకలం చెలరేగుతోంది.

#JusticeforArjunMeena అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం ఈ ఘటనపై స్పందించారు. సుశాంత్ సింగ్ కేసును బిహార్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ గిరిజన ఉపాధ్యాయుడి పేరు అర్జున్ కుమార్ మీనా. ఆయన స్వరాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్ ‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా గంగాపూర్ సిటీలోని వసుంధరా కాలనీలో నివాసం ఉంటున్నారు. కేంద్రీయ విద్యాలయాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2017లో విజయనగరంలోని కేంద్రీయ విద్యాలయాకు బదిలీ అయ్యారు. అక్క అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన తన నివాసంలో నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

అర్జున్ కుమార్ మీనా అనుమానాస్పద మృతిలో మరణించినట్లు కేసు నమోదు చేసుకున్నారు. విజయనగరం టౌన్ ఎస్ఐ నారాయణ రావు సారథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా- ఆయన మృతదేహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మృతదేహం వెనుకభాగం మొత్తం రక్తపు మరకలు కనిపించాయి. రక్తం ధారగా కారిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆయన ధరించిన ప్యాంటు కూడా చిరిగిపోయి కనిపించింది. దీనితో ఇది ఆత్మహత్య ఎలా అవుతుంది అంటూ నెటిజన్లు సిబిఐ ఎంక్వయిరీ చేస్తున్నారు. అలాగే ,ఈ ఘటన పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం అర్జున్ కుమార్ మీనా ఆత్మహత్య ఘటనపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఆయన మరణం వెనుక వాస్తవాలు ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ చేశారు. సీఎం జగన్ , ఏపీ పోలీసులకు దాన్ని ట్యాగ్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉదంతాన్ని సీబీఐకి అప్పగించినప్పుడు అదే తరహాలో అనుమానాస్పదంగా మరణించిన అర్జున్ కుమార్ మీనా కేసును కూడా ఎందుకు సీబీఐకి అప్పగించకూడదని ప్రశ్నించారు.