Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కి శుభవార్త చెప్పిన సిబిఐ కోర్టు !

By:  Tupaki Desk   |   25 Nov 2019 5:29 AM GMT
సీఎం జగన్ కి శుభవార్త చెప్పిన సిబిఐ కోర్టు !
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎనిమిదేళ్లుగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకి ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టు కి హాజరౌతున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న సమయంలో ప్రత్యేక పర్మిషన్ తెచ్చుకొని సీఎం జగన్ వెళ్లేవారు. తాజాగా సీబీఐ స్పెషల్ కోర్టు సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉండదు.

అక్రమ ఆస్తుల ఆరోపణల పై సీబీఐ దాఖలు చేసిన కేసులో వైయస్ జగన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విషయం లో 16 నెలలు హైదరాబాద్ చర్లపల్లి జైలు లో ఉన్నారు. అనంతరం బెయిల్‌ పై విడుదలయ్యారు. ఇక జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ప్రతివారం ఈ కేసు విచారణ కోసం కోర్టు ముందు హాజరైయ్యారు. అలాగే ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా సీఎం జగన్ ..కోర్టుకి హాజరైయ్యారు.

ఈ కేసు లో తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని జగన్ ఇప్పటికే సీబీఐ ని చాలాసార్లు కోరారు. సీఎంగా ఉన్నందున పాలన పట్ల దృష్టి సారించాలని, అంతేకాక తాను ప్రతివారం కోర్టుకు హాజరవ్వడం వల్ల.. ప్రభుత్వానికి 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని జగన్ తరపు లాయర్ కోర్టు కు తెలిపారు. కానీ సీఎం హోదా లో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సీబీఐ వాదనలతో కోర్టు గతం లో ఏకీభవించి కోర్టు అందుకు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత విచారణ వాయిదా వేసిన సీబీఐ కోర్టు. తాజాగా సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇకపోతే ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడంపై గతంలో టీడీపీ, జనసేన విమర్శలు కురిపించాయి.