Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

By:  Tupaki Desk   |   14 Aug 2021 11:00 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు
X
ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళుతోంది. వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి తాజాగా తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేసింది.

ఈ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. రఘునాథ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి విచారణకు ఈరోజు హాజరయ్యారు. వీరిద్దరిని మొదటిసారి విచారించింది సీబీఐ. ఇతడు సీఎం క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండడం సంచలనంగా మారింది.

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్ రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు ప్రశ్నించారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు డాక్టర్ భరత్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.

హత్యకు ఉపయోగించిన ఆయుధాలతోపాటు కీలకమైన డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సీబీఐ అధికారులు ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితులు, బంధువులను విచారిస్తుండడం రాజకీయంగా కలకలం రేపుతోంది. వారందరికీ హత్యతో ప్రమేయం ఉందా? లేక రాజకీయ ఒత్తిడులకు ఏమైనా ఉన్నాయా? అని రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.