Begin typing your search above and press return to search.

నా చావుకు కారణం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేనే!

By:  Tupaki Desk   |   1 July 2020 2:20 PM IST
నా చావుకు కారణం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేనే!
X
హన్మకొండలో స్థానిక అదాలత్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు తీవ్రకలకలం రేగుతుంది. చాకుతో గొంతు కోసుకొని అక్కడే పడిపోయాడు. రక్తం ధారలు కట్టడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అంతేకాక, అతను తన చావుకు కారణం స్థానిక ఎమ్మెల్యే అని సూసైడ్ నోట్ రాయడం మరింత దుమారం సృష్టిస్తోంది.

అతన్ని పరీక్షించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా అలంకాని పేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని బ్యాగును పరిశీలించగా ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని వెంకటేశ్వర్లు అందులో రాశాడు. వచ్చే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌ ను ఆయన కోరారు.

ఈ క్రమంలో ఇతని ఆత్మహత్యాయత్నానికి, ఎమ్మెల్యేకు సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా స్పందించారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. చూడాలి మరి పోలిసుల విచారణలో ఆ ఎమ్మెల్యేకి , ఆ వ్యక్తి ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తుందో లేదో