Begin typing your search above and press return to search.

పాడేది సామాజిక‌వ‌ర్గం పాట‌.. న‌డిచేది.. రెడ్డి వ‌ర్గం బాట‌!!

By:  Tupaki Desk   |   22 April 2022 12:30 AM GMT
పాడేది సామాజిక‌వ‌ర్గం పాట‌.. న‌డిచేది.. రెడ్డి వ‌ర్గం బాట‌!!
X
ఏపీలో జ‌ర‌గ‌నున్న 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. ఇప్ప‌టి నుంచే పునాదుల‌ను ప‌టిష్టం చేసుకుం టున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీని ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాల ముందు నుంచి ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిలో భాగంగా తాజాగా జిల్లాల ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఇక‌, వీరిపై ప‌ర్య‌వేక్ష‌ణ కోసం కో ఆర్డినేట్ చేసు కు నేందుకు రెండేసి జిల్లాల చొప్పున జిల్లాల కోఆర్డినేట‌ర్ల‌ను కూడా నియ‌మించారు.

అయితే.. తాను సామాజిక వ‌ర్గ సూత్రాన్నిపాటిస్తాన‌ని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పుకొన్న‌.. జ‌గ‌న్‌..పార్టీలో మాత్రం వారిని ప‌క్క‌న పెట్టారు. త‌న సొంతసామాజిక‌వ ర్గ‌మైన‌.. రెడ్డి వ‌ర్గానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. `త‌న‌వారుగా` ముద్ర‌ప‌డ్డ న‌లుగురు రెడ్డి నేత‌ల‌ను ఎంపిక చేసుకుని కీల‌క‌మై న బాధ్య‌త‌లు వారికే అప్ప‌గించారు. దీంతో ఈ విష‌యంపై పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

ఈ నలుగురు.. ఎవ‌రంటే..

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెడ్డిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి. వీరిలో పెద్దిరెడ్డి ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. రాజ‌కీయ స‌ల‌హాదారుగా జ‌గ‌న్ త‌ర‌ఫున వాయిస్ వినిపించే కీల‌క నేత‌గా ఉన్నారు. మ‌రోనేత‌, సీఎం జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్నారు. ఇక‌, ఇటీవ‌లే రాజ్య‌స‌భ ఎంపీగా రిటైర్ అయిన‌.. విజ‌య‌సాయిరెడ్డి ఉన్నారు. అయితే.. వీరికే జ‌గ‌న్.. పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు. వాస్త‌వానికి సామాజిక‌వ ర్గం పాట పాడే.. జ‌గ‌న్‌.. వీరినే ఎంపిక చేయ‌డం.. విస్మ‌యానికి గురి చేస్తోంద‌ని సీనియ‌ర్లే వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు.. ఈ న‌లుగురు.. పార్టీలో చ‌క్రం తిప్పుతున్న‌వారే. అయితే.. వారికి మ‌రింత ప్రాధాన్యం పెంచారు. విజ‌యసాయిరెడ్డి ఉత్త‌రాంధ్ర జిల్లాలు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పార్టీ బాధ్య‌త‌లు చూశారు. వైవీ సుబ్బారెడ్డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చ‌క్రం తిప్పారు. అయితే.. వీరిని మ‌రింత కీల‌క భాగ‌స్వామ్యుల‌ను చేస్తూ.. జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ క్ర‌మంలో జిల్లాల ప్రాంతీయ స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా.. నియ‌మించారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఏకంగా.. నాలుగు జిల్లాలు(చిత్తూరు, అనంత‌పురం, స‌త్య‌సాయి, అన్న‌మయ్య‌) అప్ప‌గించారు. వీటిలో మొత్తం 27 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇక‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి రెండు జిల్లాలు(క‌ర్నూలు, నంద్యాల‌) అప్ప‌గించారు. వీటిలో 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

వైవీ సుబ్బారెడ్డికి మూడు జిల్లాల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. వీటిలో విశాఖ‌, అన‌కాప‌ల్లి, అల్లూరి జిల్లాలు ఉండ‌గా, వీటిలో ఏకంగా 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇక‌, సాయిరెడ్డిని పార్టీలోని అన్ని విభాగాల కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మించారు. మొత్తంగా ఈ న‌లుగురిని జ‌గ‌న్ క‌ళ్లు, చెవులుగా భావిస్తున్నారు. అయితే.. పార్టీలో వీరిక‌న్నా సీనియ‌ర్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ నాయ‌కులు చాలా మంది ఉన్నారు.అదేవిధంగా ముస్తాఫా వంటి మైనార్టీ నాయ‌కులు కూడా ఉన్నారు. వీరిలో ఎవ‌రికీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌కుండా.. కేవ‌లం రెడ్డి వ‌ర్గానికి చెందిన వారికే కీల‌క బాధ్య‌తలు అప్ప‌గించ‌డంపై పార్టీలోనే పెద‌వి విరుపు క‌నిపిస్తోంది. ఇదేనా.. సామాజిక వ‌ర్గాల‌కుజ‌గ‌న్ ఇచ్చే ప్రాధాన్యం అంటున్నారు.