Begin typing your search above and press return to search.

శ్రీకృష్ణదేవరాయలు.. ఎవరి వారు..?

By:  Tupaki Desk   |   19 Jun 2019 4:39 AM GMT
శ్రీకృష్ణదేవరాయలు.. ఎవరి వారు..?
X
రాయల సీమ.. ఆ పేరు ఎలా వచ్చింది. దక్షిణ భారత దేశాన్ని పాలించిన మహా గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల పేరుమీదుగా రాయల సీమకు ఆ పేరు వచ్చింది. విజయనగర స్రామాజ్యాన్ని అద్భుతంగా పాలించిన ఆయనకు ఇప్పుడు తాజాగా కులం రంగు పులుముతున్నారు. ఆయన తమ వాడేనంటూ రాయలసీమలో విగ్రహాలు వెలుస్తున్నాయి.

తాజాగా యాదవ - బలిజ కులస్థులు శ్రీకృష్ణ దేవరాయలు మా కులస్థుడేనంటూ గంటా బజాయిస్తున్నాడు.. ఇక కొందరు చరిత్రకారులు - ఫ్రొఫెసర్లు తుళువ కులానికి చెందిన వాడిగా కృష్ణదేవరాలయను చెబుతున్నారు

క్రీ. శ 1509-1529 వరకు రెండు దశాబ్ధాలు స్వర్ణ పాలన అందించి దక్షిణ భారతదేశంలో గొప్ప పరిపాలకుడిగా శ్రీకృష్ణ దేవరాయలు పేరుపొందారు. తిరుమల వేంకటేశ్వరుడికి అపరభక్తుడిగా ఆయనను ఏడు సార్లు తన జీవితంలో దర్శించుకొని ఎన్నో కానుకలు సమర్పించారు.

అయితే ఇంత గొప్ప పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగువాడు కాకపోయినా ఆయన తెలుగును ఆదరించారు. కీర్తించారు. ఈయన శ్రీ వైష్ణువుడు. ఈయన తండ్రి తుళవ నరసనాయుడు నాగవంశపు క్షత్రియ కులానికి రాజు. దీంతో కృష్ణదేవరాయలు కూడా తుళవ వంశస్థుడే అన్న వాదన ఉంది. నరసనాయుడు ముగ్గురు భార్యలు యాదవ - బలిజ - క్షత్రియ కులానికి చెందిన వారు కావడంతో ఈ పీటముడి నెలకొంది. నాగులాంబ కొడుకుగా శ్రీకృష్ణ దేవరాయలు బలిజ కులస్థుడని వాదిస్తున్నారు.

ఇక యాదవులు.. శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ రచనల్లో యుధు వంశస్థుడని రాసుకున్నాడని ఆయన మా కులస్థుడే నంటున్నారు.

ఇలా ఎవరి వాదన ఎలా ఉన్నా తెలుగునేల గొప్ప చక్రవర్తిగా తెలుగు వెలుగులను పంచిన గొప్ప చక్రవర్తికి రాయలసీమను రతనాల సీమగా మార్చిన శ్రీకృష్ణ దేవరాయలకు కులం అంటగట్టడం తప్పు అని చరిత్రకారులు వాదిస్తున్నారు.