Begin typing your search above and press return to search.
కుల కట్టుబాట్ల పేరుతో శవాన్ని ఊర్లోకి రానివ్వని కుల పెద్దలు ... స్మశానంలోనే రాత్రి జాగారం !
By: Tupaki Desk | 4 Dec 2020 11:43 AM ISTకొన్ని సంఘటనల గురించి తెలుసుకున్న తర్వాత ఇలాంటి నవ సమాజంలో మనం నివసిస్తున్నామా అని అనిపించకమానదు. ఎందుకంటే ఆ ఘటనలు అలా ఉంటాయి. ఊర్లో ఉంటే జీవితం గడవదని , బ్రతుకుదెరువు కోసం పట్నం పోయి జీవనం సాగిస్తుంటే , గుండెపోటు తో మృతి చెందిందే, ఆ శవాన్ని కూడా ఊర్లోకి తీసుకురానివ్వలేదు కులపెద్దలు. దీనితో శవంతో పాటుగా కుటుంబ సభ్యులు రాత్రి మొత్తం స్మశానంలోనే కావిలి కూర్చున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం విజయలక్ష్మీనగర్‌లో చోటుచేసుకుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. విజయలక్ష్మీనగర్‌కు చెందిన శానం వేణుగోపాల్, హైమావతి దంపతులు హైదరాబాద్ కు గత పదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. అయన ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగించేవారు. వేణు బుధవారం విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆయన స్వస్థలం విజయలక్ష్మీనగర్ లోని ఇంటికి తీసుకురాగా, వేణుకు కులంతో సత్సంబంధాలు తెగిపోయాయని, కుల కట్టడి చెల్లించని కారణంగా మృతదేహాన్ని గ్రామంలోకి గానీ, ఇంటికి గానీ తీసుకురావొద్దని కులపెద్దలు ఆంక్షలు విధించారు.
దీనితో కుటుంబ సభ్యులు కుల పెద్దలని చాలా బ్రతిమిలాడారు . కానీ, ససేమిరా అనడం తో శ్మశాన వాటికలో గల డంపింగ్ యార్డు షెడ్డులో మృతదేహాన్ని పెట్టుకొని, కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి మొత్తం చలిలోనే శవ జాగారం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సభ్యుడు సురేందర్, ఉప సర్పంచ్ తాండ్ర నాగరాజు, వార్డు సభ్యులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
అలాగే ఈ విషయం తెలుసుకున్న మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో కుల పెద్దలు తమ బండారం బయటపడుతుందని అక్కడినుండి పారిపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కరోనాతో మృతి చెంది ఉంటాడనే అనుమానంతో గ్రామంలోనికి రానివ్వలేదని కులపెద్దలు చెప్తూ , అయన అంత్యక్రియలకు హాజరయ్యారు. సాంకేతికంగా , ఆధునికంగా ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.