Begin typing your search above and press return to search.

బీసీలు కాదు ఓడించడంలో ఓసీలు!

By:  Tupaki Desk   |   11 Nov 2018 1:30 AM GMT
బీసీలు కాదు ఓడించడంలో ఓసీలు!
X
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బీసీల సెగ ఘాటుగానే తగలనుంది. ముందస్తు ఎన్నికలలో బీసీ లకు 40 సీట్లు కావాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారికి 20 నుంచి 25 సీట్ల వరకు దక్కె అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అండ దండగా ఉన్న బీసీలు దూరమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కూడా బీసీలకు అన్యాయం జరిగితే పార్టీ నష్ట పోవడం ఖయం అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి - రేవంత్ రెడ్డి - జానా రెడ్డి - కోమటిరెడ్డి....ఇలా రెడ్డి వర్గీయుల మాటే చెల్లుబాటు అవుతుండడంతో బీసీ కులాలకు చెందిన నాయకులు గుర్రుగా ఉన్నారు. తమకు ప్రాధన్యం ఇవ్వకపోతే తగిన గుణపాఠం చెబుతామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధన కార్యాలయం గాంధీ భవన్‌ కు నిరసనల సెగ తగులుతోంది. కార్యకర్తలు ముఖ్యంగా బీసీ లకు చెందిన వారు ఉడికిపోతున్నారు. దీని ప్రభావం ఎన్నికలలో ఏ మేరకు ఉంటుందో అని భయపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చెలరేగుతున్న ఈ బీసీ ల సెగ మహాకూటమిపై కూడా ప్రభావం చూపించే అవకాశాలున్నాయంటున్నారు. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీసీల పార్టీగా పేరు గుర్తింపు పొందింది. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సీట్లపై వస్తున్న గందరగోళం ప్రభావం తెలుగుదేశం పార్టీపై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. తెలంగాణలో బీసీ కులాలకు చెందిన వారందరూ ఏకతాటి పైకి వస్తే మహాకూటమికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం. తెలంగాణలో కేసీఆర్‌ ను గద్దె దించడమే లక్ష్యం అయిన తమ ఉనికికి ఇబ్బంది కలిగితే మాత్రం సహించేది లేదని బీసీ కులాలకు చెందిన వారు ‍‍హెచ్చరిస్తున్నారు. బీసీల హెచ్చరికలతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. మహాకూటిమికి వ్యతిరేకంగా బీసీ కులాలకు చెందిన వారు ఒక్కటైతే ముందస్తు ఎన్నికలలో కూటమి అభ్యర్దుల గెలుపు కష్ట సాధ్యమే. మరో వైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - అపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీని ప్రభావం కూడా మహాకూటమి విజయ అవకాశాలను దెబ్బ తీస్తుందని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మొలకెత్తిన బీసీల ముసలం యావత్ మహాకూటమికే ఎసరు పెట్టే అవకాశం ఉందంటున్నారు.