Begin typing your search above and press return to search.
రద్దైన చట్టం కింద కేసులా? కేంద్రంపై సుప్రం ఆగ్రహం
By: Tupaki Desk | 5 July 2021 7:00 PM ISTకేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఎప్పుడో సుప్రీం రద్దు చేసిన ఐటీ చట్టాన్ని ఇంకా పోలీసులు పౌరులపై పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టం ప్రకారం ఇప్పటికీ కొన్ని కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తున్నట్టు 2015 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీసుసిబ్బందికి సమాచారం ఇవ్వాలని 2019లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇంకా పలు చోట్లు కేసులు నమోదు కావడం ఇది చాలా దారుణమైన పరిణామం అని అభివర్ణించింది. దీనిపైనే ఇవాళ విచారణ చేపట్టింది.దీనికి సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండడంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో సర్వోన్నత న్యాయస్థానాన్నిఆశ్రయించింది.ఈ సెక్షన్ కింద గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయని.. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎన్జీవో కోరింది.
ఈ పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దిగ్భ్రాంతికరం అని.. దారుణమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ ప్రమాదకర కంటెంట్ ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 55 ఏ కింద అరెస్ట్ చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015 లో దీనిపై సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏ ను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.