Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ పై కేసు నమోదు

By:  Tupaki Desk   |   4 April 2021 11:00 PM IST
కమల్ హాసన్ పై కేసు నమోదు
X
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించినందుకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రముఖ హీరో, మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ పై ఆదివారం తమిళనాడు కోయంబత్తూర్లో కేసు నమోదైందని అధికారులు తెలిపారు.

కమల్ హాసన్ ప్రస్తుతం కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. కోయంబత్తూరులోని రామపురంలోని రామర్ ఆలయం ముందు కమల్ హాసన్ తోపాటు.. సినిమా నటులు రాముడు, ఇతరులు ప్రచారం చేసి కోడ్ ఉల్లంఘించారని స్వతంత్ర అభ్యర్థి పళనికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కమల్ హాసన్ పై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 123 (3) మరియు 125 కింద కేసు నమోదైంది.

కమల్ పై కోయంబత్తూరు సౌత్‌లో బిజెపి మహిళా విభాగం జాతీయ అధ్యక్షుడు వనతి శ్రీనివాసన్, కాంగ్రెస్ నుంచి మయూరా జయకుమార్, ఏఎమ్‌ఎంకెకు నుంచి ఛాలెంజర్ పోటీపడుతున్నారు.

ఇప్పటికే కమల్ హాసన్‌ చేసిన ప్రసంగంపై మార్చి 28న బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రాధా రవి కేసు నమోదు చేయించారు. కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రేస్ కోర్సు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.