Begin typing your search above and press return to search.

ఆదిత్య బిల్డర్స్‌ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డి పై కేసు...ఎందుకంటే?

By:  Tupaki Desk   |   22 July 2020 12:00 PM IST
ఆదిత్య బిల్డర్స్‌ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డి పై కేసు...ఎందుకంటే?
X
ముందుగా చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా ,మోసపూరితంగా వ్యవహరిస్తూ అక్రమంగా విల్లాలు విక్రయిస్తుస్తున్న ఆదిత్య బిల్డర్స్‌ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డి పై బంజారాహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసారు. ఆదిత్య బిల్డర్స్ ‌తో కలిసి ఏర్పాటు చేసిన శ్రీ ఆదిత్య వంశీరామ్‌ హోమ్స్‌ ఎల్‌ ఎల్ ‌పీ జాయింట్‌ వెంచర్‌ లో చీటింగ్ కి పాల్పడుతున్నారు అంటూ , అతని పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వంశీరామ్‌ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్స్ లో మంగళవారం కేసు పెట్టారు. వంశీరామ్‌ అధినేత సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు ఆదిత్య బిల్డర్స్‌ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డి పై బంజారాహిల్స్‌ పోలీసులు 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాలు చూస్తే ... నందగిరి హిల్స్ ‌లో నివసించే వంశీరామ్‌ అధినేత సుబ్బారెడ్డి నార్సింగి లోని సర్వే నంబర్‌ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్‌ సంస్థతో 2014లో ఓ ‌ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం తో నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దింతో తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని సుబ్బారెడ్డి ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.