Begin typing your search above and press return to search.

సొంత పార్టీ ఎమ్మెల్యే పై కేసు.. దటీజ్ జగన్ గవర్నమెంట్!

By:  Tupaki Desk   |   5 Oct 2019 3:52 PM GMT
సొంత పార్టీ ఎమ్మెల్యే పై కేసు.. దటీజ్ జగన్ గవర్నమెంట్!
X
ఎంపీడీవో పై దౌర్జన్యం విషయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యక్ష ఇన్ వాల్వ్ మెంట్ ఏమీ లేదు. ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారని ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. ఆ సంఘటన పూర్వాపరాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది. ఆ సంగతలా ఉంటే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కోటంరెడ్డి అనుచరుల మీదతో పాటు ఎమ్మెల్యే మీద కూడా కేసులు పెట్టడం గమనార్హం.

సాధారణంగా అధికారా పార్టీలో ఉండే చోటామోటా నేతల మీద కూడా కేసులు నమోదు అయ్యే ముచ్చట్లు ఉండవు. అధికార పార్టీలోని నేతలు ఎన్ని ఆగడాలు చేసినా వారిని భరించాల్సిందే అనే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో అలాంటి సీన్లను ప్రజలెన్నో చూశారు.

స్వయంగా తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు, కీలకమైన పదవుల్లో ఉన్న వారు దాడులు చేసినా, ప్రభుత్వాధికారులపై దాడులు చేసినా వారికి అడ్డు చెప్పేవారు ఉండేవారు కాదు. అయితే అదంతా తెలుగుదేశం జమానా. ఇప్పుడు జగన్ జమానా నడుస్తోంది.

హద్దు మీరితే ఎవరి మీద అయినా చర్యలు తప్పవని స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడుగానే పేర్గాంచిన ఎమ్మెల్యే మీద ఇప్పుడు కేసులు నమోదు అయ్యాయి. వ్యవహారంలో ఆయన డైరెక్ట్ ఇన్ వాల్వ్ మెంట్ లేదు. ఆయన అనుచరులు హంగామా చేసినట్టుగా తెలుస్తోంది. అయినా ఎమ్మెల్యే మీద కూడా కేసులు పెట్టేశారు. ఇలా హద్దు మీరిన వారి విషయంలో కట్టడికి జగన్ ప్రభుత్వం ఏ మాత్రం మొహమాటపడకపోవడం స్వాగతించాల్సిన అంశం.