Begin typing your search above and press return to search.
ప్రముఖ చానల్లో యాంకర్లపై వేధింపుల కేసు పెట్టిన ప్రముఖ యాంకర్
By: Tupaki Desk | 28 July 2021 11:14 AM ISTతెలుగు మీడియాకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ చోటు చేసుకోని ఒక కొత్త వివాదం హాట్ టాపిక్ గా మారింది. వేధింపులు ఏ రంగానికైనా తప్పదన్నది తెలిసిందే. అయితే.. చైతన్యానికి మారుపేరుగా.. సమాజంలోని సమస్యల మీద పోరాడే మీడియా సంస్థల్లో పని చేసే యాంకర్లకు తోటి యాంకర్ల నుంచి ఎదురవుతున్న వేధింపులు.. సదరు చానల్ గడప దాటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది. మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి.
తెలుగు న్యూస్ చానళ్లకు కొదవ లేదు. పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ నిత్యం హితబోధలు చేస్తూ ఫేమస్ అయిన ఒక చానల్ కు చెందిన యాంకర్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు రోడ్డున పడ్డాయి. వారి మధ్యనున్నది వ్యక్తిగత గొడవలుగా యాజమాన్యం చెప్పుకుంటున్నది.
ఇంతకీ జరిగిందేమంటే.. సదరు చానల్ లోని ప్రముఖ యాంకర్ ఒకరి ఫోన్ ను ఆదే చానల్ లోని ఇద్దరు మహిళా యాంకర్లు.. ఒక మగ యాంకర్ తీసుకున్నరు. సరదాగా తీసుకున్న ఫోన్ ను అక్కడితో ఆపేసి ఉంటే బాగుండేదేమో. కానీ.. ఆ ఫోన్ లోని వ్యక్తిగత వీడియోల్ని.. ఫోటోల్ని సదరు యాంకర్ కు తెలీకుండా తీసుకొని.. వాటితో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివాదం కొంతకాలంగా సాగుతున్నా.. చానల్ కు చెందిన పెద్దలు కానీ.. యాజమాన్యం కానీ వీరి వివాదాన్ని పట్టించుకోలేదు. వేధింపులకు గురవుతున్నయాంకర్ గోడును విని.. ఆమె సమస్యను పరిష్కరించలేదని చెబుతారు.
దీంతో.. విసిగిపోయిన సదరు యాంకర్.. సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. తన కోలీగ్స్ అయిన ముగ్గురు యాంకర్లపై వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు.దీంతో.. సదరు యాంకర్ల మీద ఐపీసీ సెక్షన్ 66, రెడ్ విత్ 43, 84(బి) ఐటీ యాక్టు.. రెడ్ విత్ 511 కింద కేసును నమోదు చేశారు. ఈ కంప్లైంట్ లో వేధింపులకు గురి చేస్తున్నట్లు చెబుతున్న ముగ్గురు యాంకర్ల పేరును కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
ఎప్పుడైతే సైబర్ పోలీసుల వద్దకు కంప్లైంట్ వెళ్లిందో.. ఆ విషయం గురించి తెలిసిన సదరు చానల్ యాజమాన్యం ఉలిక్కిపడిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారం ఎక్కడ సోషల్ మీడియాకు పొక్కితే.. చానల్ పరువు ఏమైపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుందని చెబుతున్నారు. మొదట్లో వ్యక్తిగత విషయంగా కొట్టిపారేసిన అంశం ఇప్పుడా చానల్ కు కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారిందంటున్నారు. నిత్యం నీతులు చెబుతూ.. సమస్యలను ఎత్తి చూపే సదరు చానల్.. మరి తమ సంస్థలో పని చేసే మహిళా యాంకర్ కు వేధింపులు గురయ్యే ఇష్యూకు సొల్యూషన్ చెప్పటంలో ఎందుకు ఫెయిల్ అయినట్లు?