Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంఎల్ ఏపై కేసు

By:  Tupaki Desk   |   27 Dec 2020 5:35 AM GMT
వైసీపీ ఎంఎల్ ఏపై కేసు
X
తాడిపత్రి ఘర్షణ తాలూకు వేడి ఇంకా చల్లారలేదు. తాడిపత్రి వైసీపీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు కొడుకు+మద్దతుదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జేసీ తరపున లాయర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నాలుగు రోజుల క్రితం తాడిపత్రి మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎంఎల్ఏ కేతిరెడ్డి తన మద్దతుదారులతో దాడి చేసిన విషయం సంచలనం సృష్టించింది.

కేతిరెడ్డి భార్య అవినీతి గురించి పోస్టులు పెట్టిన వ్యక్తి జేసీ ఆఫీసులో పనిచేస్తున్నారట. దాంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి తన మద్దతుదారులతో నాలుగు రోజుల క్రితం జేసీ ఇంటిపైకి దాడి చేశారు. అయితే ఆ సమయంలో జేసీ ఇంట్లోలేరు. దాడి విషయం తెలుసుకున్న మాజీ ఎంఎల్ఏ వెంటనే ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఎంఎల్ఏ వెళ్ళిపోయారు.

తర్వాత మాజీ ఎంఎల్ఏ మద్దతుదారులు, కేతిరెడ్డి మద్దతుదారులకు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇరువైపులా చాలాసేపు రాళ్ళవర్షం కురిసింది. పోలీసులు చివరకు లాఠీచార్జి చేసి మద్దతుదారులను చెదరగొట్టాల్సొచ్చింది. తర్వాత ఎంఎల్ఏ మద్దతుదారులు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో జేసీ+కొడుకు అస్మిత్ రెడ్డితో పాటు మద్దతుదారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదుచేశారు. జేసీపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవ్వటంతో మళ్ళీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

ఈ నేపధ్యంలోనే జేసీ లాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సీసీ ఫుటేజీ ప్రకారం ఎంఎల్ఏ+కొడుకు హర్షవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరు మద్దతుదారులపై కేసులు పెట్టారు. మొత్తానికి ఎంఎల్ఏపై కేసు నమోదుతో జేసీ పంతం నెరవేరినట్లయ్యింది. ఎంఎల్ఏపై తాను ఫిర్యాదు చేయనని సీసీ ఫుటీజి ఆధారంగానే వాళ్ళపై కేసులు పెట్టాలని చేసిన డిమాండ్ నెరవేరిందనే చెప్పాలి.