Begin typing your search above and press return to search.

దిశ కేసు: రవితేజ, రకుల్ ప్రీత్ సహా 38మందిపై కేసు

By:  Tupaki Desk   |   5 Sep 2021 4:06 PM GMT
దిశ కేసు: రవితేజ, రకుల్ ప్రీత్ సహా 38మందిపై కేసు
X
2019లో హైదరాబాద్ లో శివార్లలో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ 'దిశా' ఉదంతం దేశాన్ని కుదిపేసింది. హత్యకు సంబంధించి జనాగ్రహం వెల్లువెత్తింది. చివరకు దిశ హంతకులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. అప్పటివరకు ఆమె అసలు పేరుతో పోలీసులు కేసు నమోదు చేసినా అనంతరం చట్టప్రకారం 'దిశ'గా నామకరణం చేశారు.

అయితే కొందరు దిశ అని వాడకుండా హత్యాచారానికి గురైన ఆమె అసలు పేరును పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నేరం. అత్యాచార బాధితుల పేర్లు బయటపెట్టరాదని చట్టంలో ఉంది. అయితే పలువురు సెలబ్రెటీలు సైతం ఆమె అసలు పేరును తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టారు. ఆమెకు సానుభూతి, నివాళులు ప్రకటించే క్రమంలో వీరు ఈ పోస్టులు పెట్టారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార పేరు బయటపెట్టినందుకు వీరిపై ఢిల్లీలో కేసు నమోదైంది.

తాజాగా హైదరాబాద్ 'దిశ' అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టినందుకు 38మంది సినీ నటీనటులు క్రీడాకారులపై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందులో తెలుగు సినీ హీరో రవితేజ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, క్రికెటర్లు హర్భజన్ సింగ్, షట్లర్ సైనా నెహ్వాల్, శిఖర్ ధావన్, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్, అభిషేక్ బచ్చన్ , ఫర్హాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ ఉన్నారు. వీరంతా చట్ట నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితురాలి పేరును సోషల్ మీడియాలో షేర్ చేసినందున వీరిపై చర్యలు తీసుకోవాలని గౌరవ్ గులాటీ అనే న్యాయవాది ఢిల్లీలోని స్థానిక కోర్టుతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు దిశా నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీపీ సజ్జనార్ తోపాటు ఇతర పోలీసు అధికారులపై విచారణ కొనసాగుతోంది.