Begin typing your search above and press return to search.

భూమా అఖిలప్రియ, ఆమె భర్త పై మళ్లీ కేసు

By:  Tupaki Desk   |   17 Feb 2022 6:30 AM GMT
భూమా అఖిలప్రియ, ఆమె భర్త పై మళ్లీ కేసు
X
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో రాజకీయం మరోసారి వేడేక్కింది. మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని బస్టాండ్ కూల్చివేత ఘటనలో మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన అఖిలప్రియ మరోసారి న్యూస్ మేకర్ గా మారారు. తాజాగా వరుసకు సోదరుడికి సంబంధించిన ప్రహారీ గోడ కూల్చివేత ఘటనలో ఆయన అఖిలప్రియపై ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రిపై కేసు నమోదైంది.

ఈ ఘటనలో భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ పై కేసు నమోదైంది. భూమా కిశోర్ రెడ్డికి చెందిన ఖాళీస్థలంలో కాంపౌండ్ వాల్ కూల్చివేయడంతో పాటు దానిని అడ్డుకున్న వాచ్ మెన్ పై కూడా దాడి చేసినట్లు కిశోర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే పట్టణంలోని బస్టాండ్ కూల్చివేత ఘటనలో అఖిలపప్రియపై కేసు నమోదైంది. స్థానిక ఫోర్ రోడ్ సర్కిల్ వద్ద ఉన్న బస్టాండ్ షెల్డర్ ను తొలగిస్తున్న సయంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజలకోసం కట్టించిన షెల్టర్ అని వాదించారు. దీంతో కాంట్రాక్టర్ తో వాగ్వాదానికి దిగారు. ఈ కూల్చివేతను అడ్డుకున్నారు. అయితే అఖిల ప్రియతో పాటు ఆమె మరో సోదరుడు భూమా విఖ్యాత రెడ్డి తనపై దురుసుగా ప్రవర్తించారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో విఖ్యాత రెడ్డి తో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు.

ఏపీలో టీడీపీ నాయకులై వరుసగా కేసులు నమోదవుతున్న తరుణంలో భూమా అఖిలప్రియపై కూడా వరుసగా కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ నేతలపై కావాలనే ఏదో ఒక కారణం చూపుతూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వాళ్లు తప్పులు చేస్తున్నా ఊరుకోవాలా..? అంటూ సమాధానం ఇస్తున్నారు.

ఇప్పటికే భూమా అఖిలప్రియపై హైదరాబాద్ లో కిడ్నాప్ కేసు నమోదై అప్పట్లో సంచలనమైంది. టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత భూమా అఖిలప్రియపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేశారు. తన భూమి పత్రాలతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని ఇది బోయినపల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ ఈ ఘటనపై కూకట్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చారని ఫిర్యాదులో భూమా అఖిలప్రియ పేర్కొంది.

ఆ వివాదంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన అఖిలప్రియ తాజాగా కర్నూలులో మరో వివాదంలో చిక్కుకున్నారు.