Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆ ఐదుగురు అమ్మాయిలు ఎవరు?

By:  Tupaki Desk   |   21 Feb 2016 4:41 AM GMT
ఇంతకీ ఆ ఐదుగురు అమ్మాయిలు ఎవరు?
X
హైదరాబాద్ లో వాహనదారులు ర్యాష్ గా డ్రైవ్ చేయటం కొత్తేం కాదు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. సంపన్నులు.. వీవీఐపీలు.. సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటే బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రాత్రి అయితే చాలు.. రాకెట్ల మాదిరి రోడ్ల మీద కార్లు దూసుకెళుతుంటాయి. తమ ర్యాష్ డ్రైవింగ్ తో ఇప్పటివరకూ పలు ఘటనలు చోటు చేసుకున్న ఈ ప్రాంతాల్లో వెళ్లే వారు తమ వైఖరి మార్చుకున్నట్లు అస్సలు కనిపించదు.

తాజాగా అలాంటి సంఘటన శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద చోటు చేసుకుంది. అద్దాల్లా మెరిసే రోడ్లపై అర్ధరాత్రి పూట యమాస్పీడ్ తో కార్లు వెళుతుంటాయి. శనివారం అర్థరాత్రి అలానే దూసుకెళుతున్న ఒక కారు.. అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. అనంతరం సినిమాల్లో చూపించినట్లుగా రోడ్డు మీద కారు పల్టీ కొట్టింది. ఇక.. కారు నుజ్జు నుజ్జు అయ్యింది.

ప్రమాదానికి గురయిన కారులో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారని.. వారికి స్వల్పంగా దెబ్బలు తగిలాయన్నది తాజా సమాచారం. అయితే.. ఈ అమ్మాయిలు ఎవరు? అర్థరాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నారు? కారు యజమాని ఎవరు? కారు అంత వేగంగా నడటం ఏమిటి? ఆ ఐదుగురు యువతులు మద్యం సేవించారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించటం లేదు. ఐదుగురు అమ్మాయిలతో వేగంగా వెళుతున్న కారు బోల్తా పడి యాక్సిడెంట్ కు గురైందన్న విషయం మాత్రమే బయటకు వచ్చింది. ఇంత జరిగినా.. ఈ ఘటనకు సంబంధించి ఆ ఐదుగురు అమ్మాయిలు ఎవరన్నది మాత్రం బయటకు రాకపోవటం గమనార్హం.