Begin typing your search above and press return to search.
అర్ధరాత్రి బంజారాహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం
By: Tupaki Desk | 22 Nov 2020 11:45 AM ISTహైదరాబాద్ లో ఇటీవల అర్ధరాత్రి సమయాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు బార్లు, పబ్ లలో మందేస్తున్న యువకులు ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో ఇళ్లకు బయలుదేరుతున్నారు. తాగిన మత్తులో ఓవర్ స్పీడ్ తో కార్లను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ లో ఇటువంటి సంఘటనే జరిగింది.
పీకల దాకా మందు తాగిన యువకులు ఆ మత్తులోనే శృతి మించిన వేగంతో బెంజ్ కారును నడిపి ప్రమాదానికి కారకులయ్యారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ -3లో బీభత్సం సృష్టించారు. బెంజ్ కార్ లో అతి వేగంగా వచ్చి ఇండికా కారును ఢీకొనడంతో ఇండికా వాహనంలోని ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా బంజారా హిల్స్ కు సమీపంలోని ఓ పబ్ లో కొందరు యువకులు అర్ధరాత్రి దాకా మద్యం తాగారు. ఆ తర్వాత బెంజ్ కారులో ఇంటికి బయలుదేరారు.
శ్రుతి మించిన వేగంతో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన మందుబాబులు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ -3 వద్ద ఓ ఇండికా కారును ఢీకొన్నారు. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా బెంజ్ కారులో ముగ్గురు యువకులు ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారును వేగంగా నడిపి ప్రమాదానికి కారకులైన హార్దిక్ రెడ్డి అఖిల్ ప్రమోద్ లను నమోదు లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ ఈ ప్రాంతంలో ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడంతో వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నారు. ఇక అర్ధరాత్రి అయితే మందుబాబులు లెక్కలేని వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.