Begin typing your search above and press return to search.

రోహిత్​ ఎందుకు రాలేదో ఇప్పటికీ తెలియదు.. కోహ్లీ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Nov 2020 11:00 AM IST
రోహిత్​ ఎందుకు రాలేదో ఇప్పటికీ తెలియదు.. కోహ్లీ వ్యాఖ్యలు
X
రోహిత్​ శర్మ ఆస్ట్రేలియా టూర్​కు ఎంపిక కాకపోవడం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం క్రికెట్​ అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్​మీడియా వేదికగా అనేకసార్లు స్పందించారు. ఏకంగా బీసీసీఐ చైర్మన్ గంగూలీయే రోహిత్​ శర్మను ఎందుకు ఎంపికచెయ్యలేదో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే హిట్​మ్యాన్​ రోహిత్​శర్మకు.. కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి విభేదాలు ఉన్నాయని అందుకే రోహిత్​ను ఎంపికచేయలేదంటూ సోషల్​మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. రోహిత్​కు ఫిట్​నెస్​ లేకపోవడం వల్లే ఎంపిక చేయలేదని.. ఇందులో రాజకీయం ఏమిలేదని బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఐపీఎల్​ 2020లో ముంబై ఇండియన్స్​ చాంపియన్​గా నిలిచాక రోహిత్​ను టీం ఇండియాకు కెప్టెన్​గా ప్రకటించాలన్న డిమాండ్​ తెరమీదకు వచ్చింది.

ఏకంగా గౌతమ్​ గంభీర్​ లాంటి సీనియర్​ ఆటగాళ్లే ఇటువంటి చర్చకు తెరలేపారు. గంభీర్​కు మద్దతుగా సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్​ జరిగింది. రోహిత్​ను టీ20 ఫార్మాట్​ అయిన కెప్టెన్​గా ఎంపిక చేయాలని గంభీర్​ వాదించాడు. కానీ ఈ ప్రతిపాదనను బీసీసీఐ కూడా సున్నితంగా తిరస్కరించింది. ఒక కంపెనీకి ఒక్కడే సీఈవో ఉన్నట్టే ఒక్క జట్టుకు ఒక్కడే కెప్టెన్​ ఉండాలని కపిల్​దేవ్​ లాంటి సీనియర్​ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్​ 2020లో పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రోహిత్ గాయపడ్డాడు. దీంతో బీసీసీఐ రోహిత్​ను టీం ఇండియా జట్టుకు ఎంపికచేయలేదు. కానీ ఆ తర్వాత రోహిత్​ కూడా ప్రాక్టీస్​ చేశాడు. ముంబై ఇండియన్స్​ జట్టు తరఫున ఆడాడు. తాను ఫిట్​గానే ఉన్నానని సంకేతం పంపించాడు.

చివరకు బీసీసీఐ రెండు టెస్ట్​ మ్యాచ్​లకు రోహిత్​ను ఎంపికచేసింది. బీసీసీఐ చైర్మన్​ గంగూలీ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘రోహిత్ లాంటి ఆటగాడిని మేం ఎందుకు వదులుకుంటాం. కానీ అతడు ప్రస్తుతం ఫిట్​గా లేడు అందుకే ఎంపికచేయలేదు. ఇప్పుడు అతడిని ఎంపిక చేస్తే.. ఒకవేళ గాయం ఎక్కువైతే భవిష్యత్​లో ఇబ్బంది అవుతుంది. రోహిత్​కు ఎంతో భవిష్యత్​ ఉంది’ అంటూ గంగూలీ వివరణ ఇచ్చాడు. అయితే రోహిత్​ మాత్రం ఆస్ట్రేలియా వెళ్లలేదు.

ఈ విషయంపై తాజాగా టీం ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ స్పందించాడు. ‘రోహిత్​ ఈ టెస్ట్​ సీరిస్​కు ఎందుకు రాలేదో తెలియదు. అతడి గాయంపై కూడా సమాచారం లేదు. అతడి రాకపై ప్రస్తుతం పూర్తి గందరగోళం నెలకొన్నది. రోహిత్​ ఆస్ట్రేలియా టూర్​కు వస్తాడని మేమంతా భావించాం. అతడు విమానం ఎక్కుతాడని ఎదురుచూశాం. కానీ రోహిత్​ మాత్రం రాలేదు. మేం ఎదురుచూపుల ఆట ఆడాం’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కాగా గాయం కారణంగానే తాను రాలేకపోతున్నానని, రావడం లేదని రోహిత్ మెయిల్​ పంపినట్టు సమాచారం.