Begin typing your search above and press return to search.

బీజేపీకి కెప్టెనే దిక్కయ్యారా ?

By:  Tupaki Desk   |   20 Sep 2022 2:30 PM GMT
బీజేపీకి కెప్టెనే దిక్కయ్యారా ?
X
మొన్నటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన బీజేపీకి మరో ఫెయిల్యూర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగే దక్కయినట్లున్నారు. కాంగ్రెస్ బహిష్కరించిన తర్వాత కెప్టెన్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటుచేశారు. అసెంబ్లీలో ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దెబ్బకు చిత్తుగా ఓడిపోయారు. కెప్టెన్ తో పాటు పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థులందరూ ఘోరంగా ఓడిపోయారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఆప్ దెబ్బకు చిత్తయిపోయింది.

సీన్ కట్ చేస్తే ఇపుడీ రెండు పార్టీలు ఏకమయ్యాయి. తన పార్టీని కెప్టెన్ బీజేపీలో విలీనం చేసేశారు. ఇంతకీ కెప్టెన్ను బీజేపీ ఎందుకు చేర్చుకున్నట్లు ? ఎందుకంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని పంజాబ్ లో ముందుండి నడిపిస్తారని, పార్లమెంటు సీట్లు గెలిపిస్తారని ఆశలు పెట్టుకున్నట్లుంది. అంటే పార్టీలోని నేతలపై బీజేపీ అగ్రనేతలకు ఏమాత్రం నమ్మకం లేదని అర్దమైపోతోంది. అందుకనే పార్టీలో కెప్టెనే కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నారట.

ఇంతకీ కెప్టెన్ వయసు 80కి దగ్గరలో ఉంది. 80 ఏళ్ళకి దగ్గరలో ఉన్న కెప్టెన్ 2024 ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా ముందుండి నడిపిస్తారో ఎవరికీ అర్థం కావటం లేదు. మూడు వ్యవసాయ చట్టాలు చేసిన కారణంగా నరేంద్ర మోడీ సర్కార్ పై పంజాబ్ జనాలు బాగా కసి తీర్చుకున్నారు.

రైతుల ఒత్తిడికి తట్టుకోలేక చివరకు చట్టాలను రద్దు చేసినా అప్పటికే కొన్ని వందల మంది రైతులు మరణించారు. దాంతో తమ రైతులు కేవలం మోడీ సర్కార్ వల్లే చనిపోయారనే మంట పంజాబీల్లో బాగా పేరుకుపోయింది.

ఆ కసినే మొన్నటి పంజాబ్ ఎన్నికల్లో చూపించారు. దాంతో పార్టీ నేతలు ముందుంటే మళ్ళీ అదే సీన్ రిపీటవుతుందన్న భయంతోనే కెప్టెన్ను పార్టీలో చేర్చుకున్నది. లోక్ సభ ఎన్నికలకు కెప్టెన్ను ముందుంచి సీట్లు గెలవాలన్నది బీజేపీ ఆలోచన. అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా కెప్టెన్నే ఓడించిన జనాలు అదే కెప్టెన్ను చూసి బీజేపీకి ఓట్లేస్తారా ?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.