Begin typing your search above and press return to search.

హవ్వ.. బీచ్ లో అలాంటివి వేస్తున్నారే

By:  Tupaki Desk   |   13 Jan 2016 10:39 AM IST
హవ్వ.. బీచ్ లో అలాంటివి వేస్తున్నారే
X
ఏదైనా బీచ్ కి వెళితే ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. మనసును దోచుకునే ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. ఒకవేళ.. ప్రముఖ బీచ్ లు జనసమ్మర్థంతో కిటకిటలాడుతూ ఉత్సాహంతో ఉరకలెత్తుతుంటాయి. ఇలాంటి వాటిల్లో పరిసరాలు చెత్తగా మారటం కనిపిస్తుంటాయి. అయితే.. ఇందుకు భిన్నమైన పరిస్థితులు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లోని పెంజాతీ బీచ్ లో నెలకొంది.

ఈ బీచ్ లో సేద తీరేందుకు మక్కువ చూపే అక్కడి స్థానికులు.. ఇప్పుడు ఆ పరిసరాలకు వెళ్లాలంటేనే తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇక.. పెళ్లాం పిల్లల్ని తీసుకొని వెళ్లాలంటే మాత్రం వణికిపోయే పరిస్థితి. ఈ బీచ్ ని 2014లో అక్కడి స్థానిక ప్రభుత్వం.. సదరు బీచ్ ను న్యూడ్ బీచ్ గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఈ బీచ్ లో టూరిస్ట్ ల సందడి బాగా పెరిగింది.

న్యూడ్ బీచ్ పేరుకు తగ్గట్లే ఇక్కడి వ్యవహారాలు ఏ మాత్రం జీర్ణించుకోలేనిగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకులు ఈ బీచ్ లో చెలరేగిపోయి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో.. అక్కడి స్థానికులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున వస్తున్న విదేశీ టూరిస్టుల పుణ్యమా అని బీచ్ పరిసరాలు మొత్తం బీర్ సీసాలు.. వాడి పారేసిన కండోమ్ లతో చిరాకు పుట్టిస్తున్నాయట. ఇక.. విడిచి పారేసిన లోదుస్తులు కూడా పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. దీంతో.. ఫ్యామిలీలు ఈ పరిసరాలకు వచ్చేందుకే వణికిపోయే పరిస్థితి. న్యూడ్ బీచ్ అన్న ట్యాగ్ లైన్ తగిలించిన నాటి నుంచి తమకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయని.. బీచ్ ని సర్వనాశనం చేస్తున్నారని.. వెంటనే న్యూడ్ స్టేటస్ ను మార్చేయాలని కోరుకోవటం గమనార్హం.