Begin typing your search above and press return to search.

రాహుల్‌ గాంధీకి పొద్దున్నే నిద్రలేచే అలవాటు లేదా.?

By:  Tupaki Desk   |   23 March 2019 11:00 PM IST
రాహుల్‌ గాంధీకి పొద్దున్నే నిద్రలేచే అలవాటు లేదా.?
X
అసలే ఎన్నికలు - ఆపైన కాంగ్రెస్ - బీజేపీ. ఇక ఊరుకుంటాయా. చిన్న అవకాశం దొరికినా చాలు ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి అవకాశమే ఇప్పుడు బీజేపీకి దొరికింది. రెండు రోజుల క్రితం రాహుల్‌ గాంధీ ఒక ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే కొన్ని కారణాలు వల్ల.. ప్రెస్‌మీట్‌ ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంటకు వాయిదా పడింది. దీన్ని అవకాశంగా తీసుకుని రాహుల్‌ గాంధీపై సెటైర్లు వేసేంది బీజేపీ. రాహుల్‌ గాంధీకి పొద్దున్నే నిద్రలేచే అలవాటు లేదని - అందుకే ప్రెస్‌ మీట్‌ వాయిదా పడిందని విమర్శించింది. అంతేకాదు.. ఇది ఒకందుకు మంచిదే.. ఉదయాన్నే అబద్ధాలు అడే అవకాశం లేదని దుయ్యబట్టింది.

బీజేపీ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. దొంగే కాపలాదారుడిగా మారాడని.. అలాంటి వారి కోసం రాత్రి - పగలూ - మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా ప్రెస్‌ మీట్‌ నిర్వహించేందుకు సదా సిద్ధంగా ఉన్నామని ట్వీట్‌ చేసింది. ఎన్నికల దగ్గరపడేకొద్దీ కాంగ్రెస్‌ - బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చౌకీదార్‌ - యడ్యూరప్ప డైరీ - రఫెల్‌ కుంభకోణంపై ప్రతీసారి బీజేపీని - మోదీ ప్రబుత్వాన్ని రాహుల్‌ బాగానే కార్నర్‌ చేస్తున్నారు. మరి ఇది ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపుతుందో చూడాలి.