Begin typing your search above and press return to search.
ఇద్దరిని పిల్లలని మాత్రమే కనాలని చెప్పలేం !
By: Tupaki Desk | 12 Dec 2020 5:49 PM ISTతక్కువమంది పిల్లలని కనండి అని దంపతులకి చెప్పలేము అంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అలా కాకుండా, పిల్లల్ని కనడం పై ఆంక్షలు పెడితే ఏం జరుగుతుందో కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పలు కీలక అంశాలపై వ్యాజ్యాలు వేయడంలో ప్రావీణ్యుడు. ఈ నేపథ్యంలో దేశంలో జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని అశ్వినీకుమార్ ఢిల్లీ హైకోర్టులో ఫస్ట్ పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్ లో జనాభా నియంత్రణ పెరుగుదలతో కాలుష్యం, నిరుద్యోగం పెరగడంతో పాటు కనీస అవసరాలు ప్రతి ఒక్కరికీ అందడం లేదని, జనాభా పెరుగుదల అవినీతికి కారణమవు తోందని ఆయన ఆరోపణలు చేశాడు. అయితే జనాభా నియంత్రణపై చట్టాలు చేసేది చట్టసభలు మాత్రమేనని, కోర్టులు కాదని న్యాయస్థానం కాదని చెప్తూ ఆ పిటిషన్ ను కొట్టేసింది. అయితే , ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి అప్పట్లో నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులపై తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో దేశంలో కుటుంబ సంక్షేమ పథకం స్వచ్ఛందమని తెలిపింది. తమకు ఎంతమంది పిల్లలు కావాలో అది పూర్తిగా దంపతుల ఇష్టం అని, కుటుంబనియంత్రణపై ఎలాంటి ఒత్తిడి చేయలేమని వెల్లడించింది. అలా కాకుండా, నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలు ఉండాలని బలవంతపెడితే అది జనాభా వక్రీకరణకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.