Begin typing your search above and press return to search.
పెళ్లికి ఒప్పుకోలేదని..గంజాయి కేసులో ఇరికించాడు, ఆ తర్వాత ఏమైందంటే ?
By: Tupaki Desk | 17 Aug 2021 4:00 PM ISTఈ ఏడాది జనవరి నెలలో కేరళ తిరువనంతపురం పోలీసులు, ఓ యువకుణ్ని అరెస్టు చేశారు. అతను వీవర్స్ విల్లా అనే హ్యాండ్ ల్యూమ్ కంపెనీ స్థాపకురాలు శోభా విశ్వనాథన్ మాజీ స్నేహితుడు.ఈ ఘటన జరిగే కొద్ది రోజుల ముందు ఆమె ముందు ఓ ప్రతిపాదన పెట్టాడు. అదే పెళ్లి ప్రతిపాదన. శోభా విశ్వనాథన్ కి అది ఇష్టం లేక, ఆ ప్రపోజల్ ను తిరస్కరించింది. ఆ తర్వాత, ఆమె ఆఫీసులో గంజాయి ఉన్నట్లు పోలీసులకు ఎవరో కాల్ చేసి చెప్పారు. పోలీసులు రైడ్ చెయ్యగా, నిజంగానే గంజాయి లభించింది.
ఆశ్చర్యపోయిన శోభా, తన మాజీ స్నేహితుడిపైనే అనుమానం వ్యక్తం చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అతనే ఇదంతా చేయించినట్లు తేల్చి, . అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో తాజాగా మరొకరిని పోలీసులు అరెస్టు అయ్యారు. శోభా ఆఫీసులోనే పనిచేస్తున్న ఉషా అనే అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉషనే గంజాయిని, నిందితుడి నుంచి తీసుకొని, రహస్యంగా ఆఫీసులో ఉంచిందని పోలీసులు తేల్చారు. అలా ఉష నిందితుడికి సహకరించిందని విచారణలో వెలుగులోకి రావడం తో ఆమెని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
జనవరిలో 850 గ్రాముల గంజాయి దొరికిన వెంటనే, పోలీసులు వళయాలకు చెందిన శోభ విశ్వనాథన్ ను అరెస్టు చేశారు. ఐతే, శోభ చాలా తెలివిగా వ్యహరించి , ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసింది. తనను ఎవరో కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించడంతో ,తీవ్ర కలకలం రేగింది. స్వయంగా సీఎం కలగజేసుకొని ఏం జరిగిందో సమీక్షించారు. ఆ క్రమంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, శోభ ఫ్రెండైన హరీష్ ను అరెస్టు చేశారు. దీనితో అతని మాజీ ఫ్రెండ్ అయ్యాడు. అతను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓనర్ కొడుకు. అతనే స్వయంగా గంజాయి కొని, ఇదంతా ప్లాన్ చేసినట్లు తేలింది. హరీష్ పైకి మంచివాడిలా నటిస్తూ... లోలోపల అత్యంత కుళ్లుబుద్ధులు ఉన్న వ్యక్తి అని మనకు అర్థమవుతూనే ఉంది. అతని పెళ్లి ప్రతిపాదనను శోభ విశ్వనాథన్ తిరస్కరించడమే మంచిదైంది. పొరపాటున అతన్ని పెళ్లి చేసుకొని ఉంటే, ఎలాంటి నరకం చూపించేవాడో. మనుషులంతా మంచివాళ్లు కాదు, మేకవన్నె పులులు ఉంటానే ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా మెలగాలని పోలీసులు కోరుతున్నారు. ఈ కేసులో హరీష్ ఇచ్చిన డబ్బుకి ఆశపడి ఉష ఈ నేరంలో పాలుపంచుకుంది. ఫలితంగా ఇప్పుడు జైలుపాలైంది.