Begin typing your search above and press return to search.
పార్లమెంట్ క్యాంటీన్ లో సబ్సిడీ రద్దు ..భారీగా పెరిగిన ధరలు - బిర్యానీ రేటు ఎంతంటే?
By: Tupaki Desk | 28 Jan 2021 6:15 PM ISTపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 వ తేదీన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ క్యాంటీన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ అన్ని అహార పదార్థాలు చాలా చౌకగా లభిస్తుంటాయి. టీ నుంచి బిర్యానీ వరకు ఏది తిన్నా అంతే. చాలా తక్కువ రేటు ఉంటుంది. క్వాలిటీ మాత్రం హై లెవెల్ లో ఉంటుంది. తక్కువ ధరకే లభించే ఆ నాణ్యమైన భోజనాన్ని పార్లమెంట్ సిబ్బంది, జర్నలిస్టులు, అతిథులు, ఎంపీలకు వడ్డిస్తారు.
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ క్యాంటిన్‌ను ITDC నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 58 పదార్థాలతో కూడిన మెనూను, వాటి రేట్ల వివరాలను విడుదల చేసింది. అన్ని పదార్థాల రేట్లు భారీగా పెరిగాయి. ఇంతకు ముందు రూ.60 ఉన్న వెజ్ తాలి ఇప్పుడు 100 రూపాయలకు చేరింది. టీ రూ.5, కాఫీ రూ.10, లెమన్ టీ రూ.14కి అమ్ముతున్నారు. ఇక నుంచి వెజ్ బిర్యానీ రూ.50, చికెన్ బిర్యానీ రూ. 100, మటన్ బిర్యానీ రూ.150కి లభిస్తాయి. వెజ్ బఫేకు రూ.500, నాన్ వెజ్ బఫేకు రూ.700 చెల్లించాల్సిందే.
పార్లమెంట్‌లోని క్యాంటిన్‌లోని ఆహార పదార్థాలపై ఎంపీలు, సిబ్బందికి 80శాతం సబ్సిడీ ఉండేది. ఆహార పదార్థాలపై ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతుండగా.. వీటిలో దాదాపు రూ.14 కోట్లను పార్లమెంట్ సిబ్బంది, సందర్శకులే వినియోగించుకుంటున్నారు. ఎంపీలు తక్కువ మొత్తంలో వినియోగించుకున్నారు. అంతేకాదు చివరగా 2016లో మెనూ ధరలను సవరించారు. కోటాను కోట్ల ఆస్తులుండే ఎంపీలకు అతి తక్కువ ధరకే సబ్సిడీపై ఆహారం అందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనితో సబ్సిడీ ఎత్తేశారు.
1968 నుంచి పార్లమెంటు క్యాంటీన్ ద్వారా ఎంపీలకు ఆహారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి పార్లమెంట్ సెషన్ లో సుమారు 5,000 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. క్యాంటీన్ మెనూలో భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం మొత్తం 48 ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్లమెంటు సభ్యులకు భోజనం అందించనుంది.