Begin typing your search above and press return to search.

'సాగర్'లో కేసీఆర్ గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   13 April 2021 4:04 PM GMT
సాగర్లో కేసీఆర్ గుడ్ న్యూస్
X
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక ఓడిపోకూడదని సీఎం కేసీఆర్ ‘నాగార్జున సాగర్’ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాదాపు లక్షమందితో ఈ సభ నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని.. మాస్కులు ధరించాలని చెబుతున్న ప్రభుత్వం ప్రజలపై జరిమానాలు విధిస్తోందని.. ఈ క్రమంలోనే కేసీఆర్ లక్షమందితో సభ ఎలా నిర్వహిస్తుందని పలువురు ప్రశ్నించారు.

అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని హాలియా రైతులు హైకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం లక్షమందితో సభ పెట్టడానికి వీల్లేదని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ సభను రద్దు చేయాలని రైతులు పిటీషన్ లో కోరారు.

సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రైతులు వేసిన పిటీషన్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే తాజాగా సీఎం సభను రద్దు చేయాలంటూ రైతులు దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు దీన్ని తిరస్కరించింది.. సభను రద్దు చేయాలని రైతులు వేసిన పిటీషన్ ను విచారించడానికి హైకోర్టు అనుమతించలేదు.హౌస్ మోషన్ విచారణకు అనుమతి నిరాకరించిన న్యాయస్థానం రైతుల పిటీషన్ ను తోసిపుచ్చింది. దీంతో సాగర్ లో రేపు యధావిధిగా సీఎం సభ జరుగనుంది.