Begin typing your search above and press return to search.

మండలి రద్దు..మరి లోకేష్ బాబు పరిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   29 Jan 2020 11:39 AM IST
మండలి రద్దు..మరి లోకేష్ బాబు పరిస్థితి ఏంటి?
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ప్రజల అవసరాలకి పనికిరాని మండలి ఎందుకు అంటూ రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దీనిపై త్వరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర కేబినెట్ ఈ తీర్మానానికి ఆమోదం తెలిపిన వెంటనే పార్లమెంట్ కి వెళ్తుంది. అక్కడ ఆమోదముద్ర వేస్తే, ఆ తరువాత
చివరగా రాష్ట్రపతి వద్దకి చేరుకుంటుంది. అయన దీనికి ఆమోదముద్ర వేస్తే ఇక మండలి అనేది గతం. ఏపీలో ఒకప్పుడు మండలి ఉండేది అని చెప్పుకోవాల్సిందే.

అయితే, శాసనమండలికి శుభం కార్డు వేయడంతో ఎవరికి నష్టం...ఎవరికి లాభం? ప్రస్తుతం మండలి లో ఎక్కువమంది ఉన్న టీడీపీకి ఎక్కువ నష్టంమా లేక మరో ఏడాది లో ఆధిక్యంలోకి రాబోతున్న వైసీపీకి నష్టమా? అలాగే ఎమ్మెల్సీ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ ఆశావహుల పరిస్థితి ఏంటి? గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకుందని తెలుగుదేశం అధిష్టానంపై అదే పార్టీ నాయకులు కొందరు ఇప్పుడు రగిలిపోతున్నారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది.

ఏపీ శాసన మండలి లో చైర్మన్‌ సహా మొత్తం సభ్యుల బలం 58. అందులో టీడీపీ 28 - వైసీపీ 9 - పీడీఎఫ్ 5 - బీజేపీ 2, -ఇండిపెండెంట్ 3 - నామినేటెడ్ 8 మంది ఉండగా - 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికులు టీడీపీ సభ్యులే వుండటం తో - మండలి లో టీడీపీదే మెజారిటీ. అయితే, వికేంద్రీకరణ బల్లుకు అడ్డుతగులుతోందని, వైసీపీ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే, మండలి రద్దు నిర్ణయం తో ఎక్కువ నష్టం తెలుగు దేశానికే అని చెప్పాలి. ఎందుకంటే - టీడీపీ కి చెందిన ఎమ్మెల్సీలు మొత్తం 28 మంది సభలో ఉన్నారు. వారందరు కూడా ఇప్పుడు పదవులు కోల్పోవాల్సిందే. ఆ తరువాత ఉన్న సోకార్యాలని కూడా పోగొట్టుకొని ఖాళీగా ఇంట్లో కూర్చోవడం తప్ప ఏమి చేయలేరు. ఎలాగూ టీడీపీ కి ప్రస్తుతం అసెంబ్లీ లో కూడా అంత మెజారిటీ ఏమి లేదు. కొద్దో గొప్పో మండలి లోనే టీడీపీ తన వానిని వినిపించే అవకాశాన్ని కూడా టీడీపీ చేజేతులారా పోగొట్టుకుంది అని మాట్లాడుతుకున్నారు.

ఎందుకంటే ..ఎప్పటికైనా కూడా శాసన సభదే అంతిమ నిర్ణయం. కేవలం మూడు నెలలే ఏ నిర్ణయాన్నయినా ఆపలగలమని తెలుసు. అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందమే కానీ, అంతిమం కాదనీ తెలుసు. అయినా కూడా టీడీపీ ఎదో సాధిద్దాం అంటూ మొండిగా ముందుకుపోయింది. మూడు నెలల్లో ఏదో అయిపోతుందనుకుంటే, ఇంకేదో అయ్యింది. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్సీలు పైకి చెప్పలేక , అలాగే ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న పదవులు కూడా ఊడి పోవడానికి తెలుగుదేశం అధినేత నిర్ణయమే కారణమని రగిలిపోతున్నారట. అలాగే, బాబు గారి తనయుడు లోకేష్‌ పదవి కూడా ఊడి పోనుంది.

ఎమ్మెల్సీ గా ప్రోటో కాల్‌ తో పాటు అనేక వసతులు అనుభవించిన నేతలు - రేపు రాష్ట్రపతి ఆమోదం తర్వాత - అవన్నీ కోల్పోతామని ఫీలవుతున్నారట. టీడీపీ మండలి సభ్యుల్లో ఇలాం నైరాశ్యం నెలకొనడంతో - వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్దరిస్తామని హామినిస్తున్నారట. తిరిగి అధికారం లోకి వస్తామో రామో ఇప్పుడేం చెప్పలేమని, కేవలం ధైర్యంనింపడానికే ఇలాంటి మాటలు చెబుతున్నారని మాట్లాడుకుంటున్నారట టీడీపీ ఎమ్మెల్సీలు.మొత్తానికి మండలి రద్దు తో ఎక్కువ నష్టం టీడీపీకే.

టీడీపీకి ఎక్కువ లాస్‌ స్పష్టంగా కనపడ్తున్నా - వైసీపీకీ ఎంతోకొంత నష్టం జరుగుతోంది. తొమ్మిదిమంది సభ్యులు ప్రాతినిధ్యం కోల్పోతారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రులకు పదవీ గండం వుంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణల భవిష్యత్ ఏంటన్నది అర్థంకావడంలేదట. అలాగే, చాలామంది ఎమ్మెల్సీ పదవులపై వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఓడిన నేతలు - టికెట్‌ దక్కని వారు కూడా నిరీక్షిస్తున్నారు. జగన్‌ చాలామందికి హామీలు కూడా ఇచ్చారు. వారికీ సీఎం జగన్ ఏ విధంగా న్యాయం చేస్తారు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక బీజేపీకి సైతం ఇద్దరు ఎమ్మెల్సీలు. వీరు కూడా పదవులు కోల్పోతున్నారు. అసెంబ్లీలో ఎలాగూ వీరికి ప్రాతినిధ్యంలేదు. కనీసం మండలిలోనైనా వాయిస్ వినిపించే అవకాశం వుండేది. కౌన్సిల్‌ రద్దుతో చట్టసభల్లో ఇక వారి వాయిస్‌ వినిపించదు. మొత్తానికి మండలి రద్దుతో టీడీపీ - వైసీపీ రెండు పార్టీలకూ నష్టం. అయితే టీడీపీ కే ఎక్కువ నష్టం.