Begin typing your search above and press return to search.

ఆరోగ్య శాఖ.. పోర్న్ పాట్లు .. కెనడా కాబట్టి సరిపోయింది..

By:  Tupaki Desk   |   15 April 2022 8:51 AM GMT
ఆరోగ్య శాఖ.. పోర్న్ పాట్లు .. కెనడా కాబట్టి సరిపోయింది..
X
ఏ పని చేసేటప్పుడైనా వెనుకాముందూ చూసుకోవాలంటారు. తదుపరి పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలంటారు. ఒకసారి చేజారామో.. ఇక నాలుక్కర్చుకోవడమే? నష్ట నివారణ చర్యలకు సిద్ధపడాల్సి ఉంటుంది. కెనడా ఆరోగ్య శాఖ ఇలాంటి పనే చేసి అయ్యయ్యో పొరపాటైంది అంటోంది.. చేసింది కూడా చిన్న పొరపాటేమీ కాదు.. పోర్న్ సైట్ లింక్ షేర్ చేసింది. ఇదేదో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగలేదు.. ఏకంగా జాతీయ స్థాయిలో జరిగింది. దీంతో దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే శాఖ ఇలా ఏమరుపాటుగా ఉండడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇంతకూ ఏం జరిగిందంటే..?

కెనడా ఆరోగ్య శాఖ పెద్ద పొరబాటే చేసింది. క్షణాల్లో తేరుకున్నప్పటికీ అప్పటికే నెటిజన్లు గమనించడంతో ట్రోలింగ్ తప్పలేదు. కెనడాలోని కొవిడ్ పోర్టల్‌లో పోస్టు చేయాల్సిన లింక్ కు బదులుగా.. పోర్న్ హబ్ కు చెందిన లింక్ ఒకటి పోస్టు చేసింది ఆరోగ్య శాఖ. వెంటనే జరిగిన పొరబాటు గమనించి పోస్టును డిలీట్ చేసింది కూడా. “పరిస్థితి పరిధి దాటడంతో అలా జరిగింది. తప్పుడు లింక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసేశాం” అంటూ విన్నవించుకుంది ఆరోగ్య శాఖ. లక్ష మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న హెల్త్ మినిష్ట్రీపై ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు అధికారులు.

ట్విటర్ లో షేర్ చేస్తే ఇంకేమైనా ఉందా?

అసలే ఇది టెక్నాలజీ కాలం. సోషల్ మీడియా యుగం. ఏ విషయమైనా సెకన్లలో చేరిపోతుంది. ప్రపంచమంతా పాకిపోతుంది. ఇంకేముంది? కెనడా ఆరోగ్య శాఖ చేసిన పని ఇలా వ్యాపించేసింది. క్షణాల వ్యవధిలోనే గమనించిన ఇంటర్నెట్ యూజర్లు ఇదేం పద్ధతంటూ కడిగేస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ప్రపంచంలోని మోస్ట్ ట్రాఫికింగ్ వెబ్ సైట్లలో ఒకటైన ఆ పోర్న్ సైట్ ను మైండ్ గీక్ వారు నిర్వహిస్తున్నారు.

కెనడా కాబట్టి..

వాస్తవానికి విదేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో పోర్న్ ను పెద్దగా పట్టించుకోరు. ఇందులో భాగంగానే కెనడాలో జరిగిన విషయం పెద్దగా సంచలనం కాలేదు. అదే ఇతర సంప్రదాయ దేశాల్లో జరిగి ఉంటే పెద్ద గగ్గోలే రేగేది. ఏదేమైనా.. ప్రభుత్వం తరఫున చేసే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం చాటిచెబుతోంది.